Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Record Assistant Jobs 2022 : జీతం 28,000 రూపాయలు, చిత్తూరు జిల్లాలో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఏపీ వైద్య విధాన పరిషత్, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గల ప్రభుత్వ ఆసుపత్రిలలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీనకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు:

1). ఇవి రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఆకర్షణీయమైన వేతనాలు.

3). 10వ తరగతి అర్హతలతో కూడా పోస్టుల భర్తీ.

4). కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో పోస్టుల భర్తీ.

AP Record Assistant Jobs 2022

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రిలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

చిత్తూరు జిల్లా నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరచబడిన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది  : జూన్ 2, 2022 ( 5PM ).

విభాగాల వారీగా ఖాళీలు  :

పోస్ట్ లు ఖాళీలు
ల్యాబ్ టెక్నీషియన్ 3
ఫార్మసిస్ట్ గ్రేడ్ - II 1
రేడియోగ్రాఫర్ 1
ల్యాబ్ అటెండెంట్ 3
రికార్డ్ అసిస్టెంట్ 1
ఆఫీస్ సబార్డినేట్ 1
జనరల్ డ్యూటీ అటెండర్ 4
పోస్ట్ మార్టం అసిస్టెంట్ 3

మొత్తం పోస్టులు  :

17 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి కెమిస్ట్రీ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ కోర్సులను పూర్తి చేసిన వారు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీ. ఎస్సీ /బీ. ఎస్సీ (హాన్స్ )/ఎంఎస్సీ విత్ కెమిస్ట్రీ కోర్సులను కంప్లీట్ చేసినవారు కూడా ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

పదవ తరగతి పాస్ అయ్యి, డిప్లొమా ఇన్ ఫార్మసీ /బీ. ఫార్మసీ కోర్సులను పూర్తి చేసిన వారు ఫార్మసిస్ట్ గ్రేడ్ - II పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సీఆర్ఏ ఎగ్జామినేషన్ ను ఖచ్చితంగా కంప్లీట్ చేసిన అభ్యర్థులు మరియు బీఏ /బీఎస్సీ /ఎంఎస్సీ /ఎంఏ /బీఎస్సీ (హాన్స్ )/బీఏ(హాన్స్ ) కోర్సులను పూర్తి చేసిన వారు రేడియో గ్రాఫర్ కోర్సులను పూర్తి చేయవలెను.

10వ తరగతి  మరియు ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అసిస్టెంట్ ఒకేషనల్ కోర్సు) లను పూర్తి చేసిన వారు ల్యాబ్ అటెండెంట్ కోర్సులను పూర్తి చేయవలెను.

బ్యాచ్ లర్ డిగ్రీ కోర్సులను మరియు డీసీఏ/పీజీడీసీఏ కోర్సులను ఖచ్చితంగా కంప్లీట్ చేసినవారు రికార్డ్ అసిస్టెంట్  ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను.

10వ తరగతి ను విద్యా అర్హతలుగా కలిగిన అభ్యర్థులు ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ , పోస్ట్ మార్టెమ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

విభాగాలను అనుసరించి పైన తెలిపిన అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏపీ పారామెడికల్ బోర్డు నుండి రిజిస్ట్రేషన్ అయి ఉండవలెను.

వయసు   :

18-42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ /ews కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి :

వెబ్సైటు నుండి దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫారంను పూర్తి చేసి, వాటికీ సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి, నిర్ణిత గడువు చివరి తేదీలోగా  ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.

దరఖాస్తు ఫీజు   :

ఓసీ కేటగిరీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతల మార్కులు, వెయిటేజ్, ఎక్స్పీరియన్స్  ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 నుండి 28,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website

Notification

Post a Comment

0 Comments