డి.ఆర్.డి.ఒ ద్వారా సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ (ఎస్.ఎస్.పి.ఎల్) నుండి జూనియర్ రేసెర్చ్ ఫెలొ (జె.ఆర్.ఎఫ్) ఖాళీల నియామకానికి తాజాగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది.ఈ పోస్టులు అనేవి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు అన్నీ రాష్ట్రాల అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ అర్హులే.
ముఖ్యమైన అంశాలు:
1).ఎటువంటి వ్రాత పరీక్ష లేదు.
2).ఇంటర్వ్యూ ద్వార ఎంపిక.
3).కాంట్రాక్ట్ పద్దతి లో ఉద్యోగాల భర్తీ.
4).ఆకర్షనీయమైన జీతం.
5).ఇరు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.
6).ఫ్రెషర్స్ కూడా అర్హులు.
అర్హత కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదు.
ఇండియన్ సిటిజన్స్ మేల్ & ఫిమేల్ అభ్యర్థులు ప్రతీ ఒక్కరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే చివరి తేది: 30 జూన్ 2022
మొత్తం పోస్టుల సంఖ్య:
ఈ ప్రకటన ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు:
ఫిజిక్స్, ఎలక్ట్రానిక్, మెటీరియల్ సైన్స్ విభాగాలలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా ఫిజిక్స్, ఎలక్ట్రానిక్, మెటీరియల్ సైన్స్ విభాగాలలో ఎమ్మేస్సి పూర్తీ చేసి ఉండాలి. మరియు వాలిడ్ నెట్/గేట్ స్కోర్ ఉండాలి.
ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదు.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్టీ/ ఎస్సి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు పరిమితి కలదు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 31,000/- రూపాయల జీతం మరియు హెచ్.ఆర్.ఏ ఇవ్వడం జరుగుతుంది.
అప్లై చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ ఇ-మెయిల్ ద్వారా అప్లై చేసుకొవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే ఇ-మెయిల్ అడ్రస్:
hard.sspl@gov.in
0 Comments