ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో పోస్టల్ GDS కి సంబందించి జాబ్ నోటిఫికేషన్ వచ్చిన విషయం మన అందరికి తెలిసినదే.
అయితే ఈ పోస్ట్ లు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో 2480 ఖాళీలు, తెలంగాణలో 1266 పోస్ట్ ల భర్తీ జరుగుతుంది.
అయితే ఈ పోస్ట్ లను కేవలం పదోతరగతి అర్హతతో భర్తీ చేస్తున్నారు. పరీక్ష లేకుండా ఈ పోస్ట్ లను కేవలం 10వ తరగతి లో వచ్చిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తున్నారు. పదోతరగతి తో ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చును.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకొవడానికి 27.01.2023 to 16.02.2023 వరకు టైమ్ అనేది ఉంది. దరఖాస్తు లో దిద్దుబాటు కు 17.02.2023 to 19.02.2023 వరకు టైమ్ ఇవ్వడం జరిగింది.
అయితే ఈ పోస్ట్ లకు తీవ్రమైన పోటి గతం లో నెలకుంది. అయితే చాలా మంది అభ్యర్థులు 95 మార్కులకు పైన వచ్చిన వారు జాబ్ సాధించడం జరిగింది. అయితే PWD కి సంబందించిన ఒక వ్యక్తి కి మాత్రం కేవలం 67% మార్కులతో జాబ్ సాధించడం జరిగింది.
అయితే మన ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిటీ ఆధారంగా ఇలా ఉన్నాయి. UR-1131, OBC-483, SC-298, St-158, EWS-340 పోస్ట్ లు ఉన్నాయి. తెలంగాణ లో UR-528, OBC-300, SC-190, St-78, EWS-141 ఖాళీలు ఉన్నాయి
అర్హతలు :
పదోతరగతి పాస్ అయిన సర్టిఫికేట్ ఉండవలెను, మరియు తెలుగు వచ్చి ఉండవలెను, సైకిల్ తొక్కడం వచ్చి ఉండవలెను.
మీలో ఎవరైన ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే క్రింద కనిపిస్తున్న అప్లై బటన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. పూర్తి సమాచరం కొరకు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తి గా చదవండి.
0 Comments