ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయింది.
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూ ల నిర్వహణ లేకుండా ఒప్పంద ప్రాతిపదిక విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల ఏపీ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Tirupati Jobs
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. ఈ పోస్ట్ లు బ్యాక్ లాగ్ పోస్ట్‌లుగా చెప్పుకోవచ్చును.
ముఖ్యమైన తేదీలు :
రిజిస్ట్రేషన్ మరియు ఫీజు పేమెంట్స్ కు చివరి తేది : ఆగష్టు 1, 2021
అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేది : ఆగష్టు 3, 2021
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది : ఆగష్టు 10, 2021
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేది : ఆగష్టు 11&12, 2021
అపాయింట్మెంట్ ఆర్డర్స్ తేది : ఆగష్టు 13, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 13
అర్హతలు :
మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
42 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బీసీ /ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
10వ తరగతి మరియు విద్యా అర్హతల మార్కుల మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సుమారుగా ప్రారంభ జీతం 20,000 రూపాయలు వరకూ లభించనుంది.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :
0877-2248894
వీటితో పాటు మరెన్నో ఉద్యోగాలు Clik Here
0 Comments