5వ & 10వ తరగతి అర్హతలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రారంభ జీతం 20,976 రూపాయలు, దీని గురించి పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్ కాస్టింగ్ కు చెందిన మినీ రత్న కంపెనీ అయిన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ పోస్ట్ ని తప్పనిసరిగా అభ్యర్థులు మీ వాట్సప్ మరియు పేస్‌బుక్ ద్వారా తప్పనిసరిగా షేర్ చెయ్యండి. ఈ జాబ్స్ కి సంబందించిన అన్ని లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది. BECIL Jobs Recruitment 2021 telugu
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టు బేసిస్ ఉద్యోగాలు.
2). 5వ మరియు 10వ తరగతి విద్యా అర్హతలతో కూడా పోస్టుల భర్తీ.
3). గౌరవ స్థాయిలో జీతములు.
అతి తక్కువ విద్యా అర్హతలతో మరియు మంచి స్థాయిలో జీతములతో భర్తీ చేయబోతున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, జీపిఓ కాంప్లెక్స్, న్యూ ఢిల్లీ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
BECIL లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి - విధానాలను గూర్చి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యంశాలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 10, 2021.
విభాగాల వారీగా ఖాళీలు :
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 32
హౌస్ కీపింగ్ స్టాఫ్ - 20
మాలి - 01
సూపర్ వైజర్ - 1
గార్బెజ్ కలెక్టర్ - 1
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా విడుదల అయిన ఈ ప్రకటన ద్వారా మొత్తం 55 సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులను అభ్యర్థులకు కల్పించనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు ల నుండి 5వ తరగతి /10వ తరగతి / గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సూపర్ వైజర్ పోస్టులకు 2 సంవత్సరాలు అనుభవం అవసరం అని ప్రకటనలో తెలిపారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనను ఈ నోటిఫికేషన్ లో తెలుపలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 450 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
టెస్ట్ /వ్రాత పరీక్ష /ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతముగా 15,908 రూపాయలు నుండి 20,976 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments