ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగరంలో ఉన్న ఏపీ హై కోర్ట్ లో ఖాళీగా ఉన్న లా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1).ఇవి కాంట్రాక్టు బేసిస్ ప్రభుత్వ ఉద్యోగాలు.
2). మంచి స్థాయిలో జీతాలు.
ఒప్పంద ప్రాతీపదికన ఏపీ హై కోర్ట్ లో భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ధరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు. High Court Jobs Telugu Salary 25000
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన విద్యా అర్హతలు, ఎంపిక విధానం తదితర ముఖ్యంశాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ చేరుటకు చివరి తేది : నవంబర్ 23 , 2021
వైవా నిర్వహణ తేదీ : డిసెంబర్ 6, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
లా క్లర్క్ లు - 20
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 20 పోస్టులను తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో మూడు /ఐదు సంవత్సరాల లా డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.
వయసు :
30 సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు . ప్రభుత్వ నిబంధనల మేరకు ఏజ్ రిలాక్స్యేషన్ (వయసు పరిమితి సడలింపు ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని నింపవలెను. తదుపరి నింపిన దరఖాస్తు ఫారం లకు సంబంధిత విద్యా అర్హతల ధ్రువీకరణ పత్రాలను జతపరచి ఈ క్రింది చిరునామా (అడ్రెస్ ) కు నిర్ణిత గడువు చివరి తేది లోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా, కేవలం వైవా వాయిస్ లో సాధించిన మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతంగా 25,000 రూపాయలు లభించనుంది.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా (అడ్రస్ ) :
Registrar (Recruitmen ),
High court of Andhrapradesh at Amaravathi,
Nelapadu,
Guntur District,
Andhra Pradesh,
Pincode - 522237.
0 Comments