భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 80,000 రూపాయలు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది.
ముఖ్యంశాలు :
1). ఇవి ఒప్పంద ప్రాతీపదిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). భారీ స్థాయిలో జీతములు.
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. BHEL Jobs Recruitment
మరియు ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.
మంచి స్థాయిలో వేతనాలు లభించే ఈ కేంద్ర ప్రభుత్వ పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : నవంబర్ 30, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
యంగ్ ప్రొఫెషనల్స్ - 10
అర్హతలు :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
30 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా కేవలం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల షార్ట్ లిస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments