హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 2,20,000 రూపాయలు వరకూ, ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే, వెంటనే అప్లై చేసుకోండి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న మినీ రత్న -1 కంపెనీ కు చెందిన మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI), హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ, అవసరాన్ని బట్టి పరీక్షల నిర్వహణ ఉంటుంది.
3). భారీ స్థాయిలో జీతభత్యాలు.
మంచి స్థాయిలో వేతనాలు లభించే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. MIDHANI Jobs Recruitment
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అర్హులే అనీ ఈ ప్రకటనలో పొందుపరచడం జరిగింది.
మిధాని, హైదరాబాద్ లో భర్తీ చేయబోయే ఈ పోస్టుల విధి -విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : నవంబర్ 24, 2021.
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ మేనేజర్స్ ( F & A ) - 2
మేనేజర్స్ ( F & A ) - 4
డిప్యూటీ జనరల్ మేనేజర్ ( F & A ) - 1
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 7 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
ICWA /CA అసోసియేట్ మెంబెర్ గా ఉండవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
30 నుండి 45 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ / దివ్యాంగుల అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
పర్సనల్ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఆవశ్యకత ను బట్టి వ్రాత పరీక్షలను నిర్వహించే అవకాశం కలదని ఈ ప్రకటనలో తెలిపారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40,000 రూపాయలు నుండి 2,20,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
ఈ జీతంతో పాటు డీఏ +హెచ్. ఆర్. ఏ +ఈపీఎఫ్ + గ్రాట్యుటీ తదితర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
0 Comments