ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కు చెందిన మినిస్ట్రీయల్ గ్రేడ్ సర్వీసెస్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
1). ఇవి ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.
2).5వ తరగతి మరియు 7వ తరగతి అర్హతలుతో కూడా ఉద్యోగాలు.
3). ఆసక్తికరమైన జీతములు.
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా భర్తీ చేసే ఈ పోస్టుల భర్తీకి అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అనీ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం ను మనం ఇపుడు తెలుసుకుందాం.
ఈ ఆర్టికల్ చదివిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా షేర్ చెయ్యండి. ఈ సమాజానికి మేలు చెయ్యండి.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ ధరఖాస్తులు చేరడానికి చివరి తేది : నవంబర్ 20,2021.
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ అసిస్టెంట్స్ - 8
రికార్డు అసిస్టెంట్స్ - 1
ఆఫీస్ సబ్ - ఆర్డినేట్స్ - 12
వాచ్ మెన్ - 1
స్వీపర్ - 1
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 23 పోస్టులను తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి సంబంధిత సబ్జెక్టు లలో ఐదవ తరగతి /ఏడవ తరగతి /ఇంటర్మీడియట్ /డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
కొన్ని కేటగిరీ పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆఫ్ లైన్ విధానంలో ఈ క్రింది చిరునామాకు (అడ్రస్ ) కు నింపిన దరఖాస్తు ఫారం లను నిర్ణిత గడువు చివరి తేదిలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
కాంపిటీంట్ అథారిటీ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతంగా 12,000 రూపాయలు నుండి 15,000 రూపాయలు వరకూ లభించనుంది.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా (అడ్రస్ ) :
The Director of Industries,
1st Floor, Government Printing Press Buildings,
Mutyalamapadu,
Vijayawada,
Pincode : 520011.
0 Comments