ఢిల్లీ పోలీస్ ఎక్సమినేషన్ బోర్డు కు సంబంధించిన కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్),మేల్ & ఫిమేల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షల (CBT) యొక్క ఫలితాలకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా ప్రకటించినది.
ఢిల్లీ పోలీస్ విభాగములో ఖాళీగా ఉన్న సుమారు 5690 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మేల్ /ఫిమేల్ పోస్టుల భర్తీకి మార్చి 15,2021 వ తేదీన సీబీటీ పరీక్షలు నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), ఈ పరీక్షల ఫలితాలను తాజాగా విడుదల చేసినది.
ఈ పరీక్షలకు సుమారుగా 67,740 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాయగా వారిలో కేటగిరీ ల వారీగా 5690 మంది మేల్ /ఫిమేల్ అభ్యర్థులను ఫీజికల్ మెసర్మెంట్స్ టెస్ట్ లు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లకు ఎంపిక చేసినట్లు ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది. SSC Constable Cut Off 2021
ఈ పరీక్షలకు సంబంధించిన కట్ ఆఫ్ మార్కులు, రిజల్ట్స్ వివరాలను తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచినట్లుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలిపినది.
ఈ పోటీ పరీక్షలకు హాజరు అయిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా మీ మీ ఫలితాలను సరి చూసుకోవచ్చు.
0 Comments