పరీక్ష లేదు, 8వ తరగతి అర్హతతో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు, ఇంటర్వ్యూ తేదీలు ఇవే, వెంటనే చదవండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా లో ఉన్న అమరావతి నగరంలో గల అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటనను ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ తాజాగా విడుదల చేసింది.
ముఖ్యాంశాలు :
1). ఇవి యూనివర్సిటీ కు చెందిన పోస్టులు.
2). వాక్ - ఇన్ - ఇంటర్వ్యూల ద్వారా పోస్టుల భర్తీ.
3). 8వ తరగతి అర్హతలతో కూడా ఉద్యోగాలు.
4). గౌరవ స్థాయిలో వేతనాలు.
5). టెంపరరీ బేసిస్ లో ఈ పోస్టుల భర్తీ జరుగనుంది.
ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చును అని ప్రకటనలో తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, అమరావతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : ఫిబ్రవరి 17, 2022
మరియు ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10:30 గంటలకు
నిర్వహణ వేదిక :
అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, అమరావతి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విభాగాల వారీగా ఖాళీలు :
ల్యాబ్ టెక్నీషియన్ - 1
సెమీ - స్కిల్డ్ లేబర్స్ - 6
మొత్తం ఖాళీలు :
7 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
బీ. టెక్ / డిప్లొమా (ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్ /మెకానికల్ ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు మరియు 8 వ తరగతి విద్యా అర్హతలుగా కలిగిన అభ్యర్థులు సెమీ - స్కిల్డ్ లేబర్ పోస్టులకు అర్హతలుగా ఉండవలెను అని ఈ ప్రకటన ద్వారా తెలుపుతున్నారు.
మరియు బయో - ఫర్టిలైజర్స్ లో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరిచలేదు.
ఫీజు :
ఎటువంటి ఫీజులు అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు :
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపీకైన అభ్యర్థులకు నెలకు జీతంగా 15,000 రూపాయలు మరియు సెమీ- స్కిల్డ్ లేబర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12,000 రూపాయలు జీతంగా అందనుంది.
కావాల్సిన ద్రువీకరణ పత్రాలు :
ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ బయో డేటా, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక కాపీ ఆటేస్టేడ్ సర్టిఫికెట్స్ ను తమ వెంట తీసుకుని రావలెను అని ప్రకటన ద్వారా తెలుపుతున్నారు.
సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్ :
9030551865
E - Mail address
ars.amaravati@angrau.ac.in
0 Comments