Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Annavaram Temple Jobs 2022 : అన్నవరం దేవస్థానం లో ఉద్యోగాలు, అప్లై చేసుకోండి ఇలా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన  తాజాగా విడుదల అయినది.

ఈ ధార్మిక పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో తెలుపడం జరిగింది.

Annavaram Temple Jobs 2022


అన్నవరం దేవస్థానం నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం. Annavaram Temple Jobs 2022

ముఖ్యమైన తేదీలు :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు పోస్ట్ ద్వారా పంపడానికి చివరి తేది :  ఫిబ్రవరి 2, 2022.(సాయంత్రం 3 గంటల లోపు).

విభాగాల వారీగా ఖాళీలు  :

సప్త సతి పారాయణ దారు (గ్రేడ్ - 2 )            -      1

అధర్వన వేద పారాయణ దారు ( గ్రేడ్ - 3 )  -      1

అర్హతలు :

దేవాదాయ శాఖ వారిచే గుర్తింపబడిన పేరు కల్గిన పీఠం నుండి శ్రీ విద్య పారాయణ మరియు ఉపాసన సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ సప్తసతి పారాయణదారు (గ్రేడ్ - 2) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మూలము లేదా సంహిత, అధర్వన వేదం నందు కమిషనర్, దేవాదాయ శాఖ వారిచే గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు అందరూ అధర్వన వేద పారాయణ దారు (గ్రేడ్ -3) పోస్టులకు అప్లై చేసుకోవలెను.

అభ్యర్థులు స్మార్త బ్రాహ్మణులు అయి ఉండాలి అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

20 నుండి 30 సంవత్సరాలు లోపు వయసున్న అభ్యర్థులు సప్తసతి పారాయణ దారు ( గ్రేడ్ -2) పోస్టులకు, మరియు 18 నుండి 38 సంవత్సరాలు లోపు వయసున్న అభ్యర్థులు అధర్వన వేద పారాయణదారు ( గ్రేడ్ - 3) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఈ క్రింది వెబ్సైటు లింక్ ను క్లిక్ చేసి, దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, అప్లికేషన్స్ ఫారం ను  నింపిన తదుపరి, ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు తమ తమ దరఖాస్తులకు నిర్ణిత గడువు చివరి తేది లోగా సంబంధిత చిరునామాకు పోస్ట్ ద్వారా పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

500 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ను దరఖాస్తు ఫీజుగా పంపవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

మౌఖిక మరియు వ్రాత పరీక్షలకు లోబడి మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఎంపికైన అభ్యర్థులకు దేవస్థానం బోర్డు నిర్ణయించిన మేరకు ఆకర్షనీయమైన జీతములు లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా ( అడ్రస్ ) :

కార్యనిర్వహణాధికారి / శ్రీ యుత కమిషనర్

శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం,

అన్నవరం - 533 406,

తూర్పుగోదావరి జిల్లా,

ఆంధ్రప్రదేశ్.

Website

More Jobs in telugu Today Click Here

Tirupati Devasthanam Jobs 2022 Telugu

Post a Comment

0 Comments