ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ పోస్టుల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుందా..? నూతన జిల్లాలకు పోలీసుల కేటాయింపులపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన.
రాష్ట్రంలో నేటి నుండి నూతనంగా 26 జిల్లాలు ఏర్పాటు అమలులోనికి వచ్చినది.
ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ ఒక కీలక ప్రకటనను చేసింది.
కొత్తగా ఏపీ లో 26 జిల్లాలను ఏర్పాటు చేసిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు అధికారులు మరియు సిబ్బంది కేటాయింపునకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది.
ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తాజాగా ఉత్తర్వులను జారీ చేసినట్లుగా తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ ఉన్న 13 జిల్లాల్లోని పోలీసు సిబ్బందిని 26 జిల్లాలకు, మరియు ఎస్పీ క్యాడర్ నుండి సిబ్బంది వరకూ 26 జిల్లాలకు కేటాయించినట్లుగా అధికారికంగా ఒక ప్రకటన తాజాగా వెలువడినది.
AP లో మరిన్ని ఉద్యోగాలు Click Here
TS లో మరిన్ని జాబ్స్ Click Here

0 Comments