గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్టుమెంటు ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ ఎంటర్ ప్రైస్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
3). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చును.
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు భారత దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈసీఐఎల్ నుండి తాజాగా వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 11, 2022.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహణ తేది : త్వరలో ప్రకటించబడును.
ఉద్యోగాలు - వివరాలు :
జూనియర్ టెక్నీషియన్ - 1625
విభాగాల వారీగా ఖాళీలు :
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 814
ఎలక్ట్రీషియన్ - 184
ఫిట్టర్ - 627
మొత్తం పోస్టులు :
1625 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ /ఎలక్ట్రీషియన్/ఫిట్టర్ విభాగాలలో రెండు సంవత్సరాల ఐటీఐ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
30 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కూడా కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకి అభ్యర్థులు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా, కేవలం షార్ట్ లిస్ట్ / ఇంటర్వ్యూ /డాక్యుమెంట్ వెరిఫికేషన్ విధానముల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం 20,480 రూపాయలు మరియు రెండవ ఏడాది 22,528 రూపాయలు, మూడవ సంవత్సరం 24,780 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
ఈ జీతంతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్, కంపెనీ పీఎఫ్, టీఏ/డీఏ వంటి సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

0 Comments