చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైల్వే గ్రూఫ్-D నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబందించి నోటిఫికేషన్ ని రైల్వే రిక్యూర్ట్‌మెంట్ బోర్డ్ విడుదల చెయ్యడం జరిగింది. మొత్త 32438 పొస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పోస్ట్ లు రైల్వే లో లెవల్-1 పొస్ట్ లు గా చెప్పుకోవచ్చును. జీతం 7th CPC pay Matrix గా చెప్పుకోవచ్చును. ఈ పొస్ట్ లకు అర్హతలు ఎంపిక విధానం ఇప్పుడు పూర్తిగా చూద్దం
ఉద్యోగం రకం : పర్మెనెంట్ కేంద్రప్రభుత్వ ఉద్యోగం. జాబ్ వస్తే లైఫ్‌సెట్ అయినట్లే మంచిగా జీతం పెరుగుదల ప్రమోషన్స్ అన్ని ఉంటాయి.
మొత్తం ఖాళీలు :
32000 పోస్ట్ లుగా చెప్పుకోవచ్చును. ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడ కనిపిస్తుంది.
విద్యార్హతలు :
ఈ పోస్ట్ లకు పదోతరగతి లేదా ITI లేదా NAC సర్టిఫికేట్ ఉన్న సరే ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. ఒక్క మాటలో చెప్పాలి అంటే పదోతరగతి పూర్తి చేసిన ఎవరైన సరే ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.
వయస్సు :
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే వారి యొక్క వయస్సు 01.01.2005 నాటికి 18-36 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనలను అనుసరించి SC,ST,OBC వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
రాత పరీక్ష మరియు దేహదారుడ్య పరీక్ష ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. రాతపరీక్షలో మంచి మార్కులు వచ్చిన వారిని 1:3 నిష్పత్తిలో PET కి పిలుస్తారు. దీనిలో కూడ అర్హత సాధించిన తరువాత ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
ఫీజు :
జనరల్ అభ్యర్థులకు ఫీజు: రూ. 500. CBT పరీక్షకు హజరు అయిన తరువాత 400 తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ( మైనస్ బ్యాంక్ ఛార్జీలు)
PwBD, స్త్రీ, లింగమార్పిడి, మాజీ సైనికులు, SC/ST, మైనారిటీ కమ్యూనిటీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతి అభ్యర్థులకు ఫీజు రూ. 250 లు పరీక్షకు హజరు అయిన తరువాత 250 తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ( మైనస్ బ్యాంక్ ఛార్జీలు)
ఎలా అప్లై చేసుకోవాలి:
రైల్వే కేవలం షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చెయ్యడం జరిగింది. పూర్తి నోటిఫికేషన్ 23.01.2025 లో విడుదల చెయ్యనుంది. అప్లై చేసుకోవడానికి టైమ్ 22.02.2025 వరకు ఇవ్వనుంది. అభ్యర్థులు చూసుకోవడానికి షార్ట్ నోటిఫికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ప్రభుత్వ అదికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవలసి ఉంటుంది. పూర్తి సమాచర వివరణ PDF లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
పరీక్ష లో విజయం సాధించడం ఎలా :
గణితం, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్ మరియు జనరల్ అవేర్‌నెస్ వంటి విభాగాలతో సహా పరీక్షా నిర్మాణంతో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఇది ప్రిపరేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయపడుతుంది. మీ వేగం మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి సమయ పరిమితిలో ప్రశ్నలను పరిష్కరించడం ప్రాక్టీస్ చేయండి. పరీక్ష సమయంలో ప్రతి విభాగాన్ని దాని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.
అధిక కష్టంగా గల అంశాలపై దృష్టి పెట్టండి: అరిథ్మెటిక్, రీజనింగ్ మరియు జనరల్ అవేర్‌నెస్ వంటి అధిక కష్టంగా గల అంశాలను గుర్తించి, వాటిపై దృష్టి పెట్టండి. మునుపటి సంవత్సరాల పేపర్లు మరియు మాక్ టెస్ట్‌లతో స్థిరమైన అభ్యాసం మీరు అడిగే ప్రశ్నల రకాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది మరియు విశ్వాసాన్ని పెంచుతుంది.
0 Comments