RRB NTPC మరియు GROUP -D పరీక్షలలో జనరల్ అవేర్నెస్ కు సంబంధించిన విభాగాన్ని మనం బాగా ప్రిపేర్ అవ్వగలిగితే 40 మార్కులను సంపాదించుకోవచ్చు.
జనరల్ అవర్నెస్ లో భాగంగా భారతదేశ భౌగోళిక అంశాలు (ఇండియన్ జాగ్రఫీ ) ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ అంశాలను నేటి "TELUGUCOMPETITIVE.COM" అందిస్తున్న "RRB NTPC / GROUP - D ప్రిపరేషన్ "లో చదివేద్దాం రండీ.
"భారత దేశం - ఉనికి "
భారతదేశాన్ని మూడు పేర్లతో పిలుస్తారు. అవి హిందూస్తాన్ మరియు భారతదేశం మరియు ఇండియా.
పర్షియన్లు మనదేశాన్ని హిందూస్తాన్ అని పిలిచేవారు మరియు హిందువులు అత్యధికంగా నివసించడం వల్ల కూడా భారతదేశాన్ని హిందూస్తాన్ అని పిలిచేవారు.
మన భారతదేశాన్ని ప్రప్రధమంగా (మొదటిసారి ) పరిపాలించిన రాజు " భరతుడు " పేరు మీదుగా మనదేశానికి భారతదేశం అనే పేరువచ్చింది అని చరిత్ర మనకు తెలియచేస్తుంది.
"సింధు నది" వెంబడి నివసించిన ప్రజల్ని గ్రీకులు సిండన్ మరియు ఇండన్సీ అని పిలిచేవారు. ఇండియన్ లనే ఆంగ్లేయులు వచ్చిన తరువాత ఇండియన్స్ గా మార్చారు..మన భారతదేశం
పూర్వనామం :
" జంబూ ద్వీపం "
భారతదేశం 8°4' నుంచి 37°6' ఉత్తర అక్షాoశాలు మధ్య మరియు 68°7' నుంచి 97°25' 3తూర్పురేఖాoశాలు మధ్య విస్తరించి ఉన్నది.
భారతదేశం అక్షాన్స మరియు రేఖాన్సల పరంగా మొత్తం 30°ల విస్తీర్ణంను కలిగియున్నది.
మన భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం - 32, 87, 263 చదరపు కిలోమీటర్లు.. అనగా,, 32.8 లక్షల చదరపుకిలోమీటర్లు,, మరియు 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు.
ప్రపంచంలో మన భారతదేశం విస్తీర్ణం పరంగా " 7 "వ అతిపెద్ద దేశంగా పిలువబడుతుంది.
భారతదేశంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద రాష్ట్రాలు వరుసగా, 1). రాజస్థాన్ 2). మధ్యప్రదేశ్ 3). మహారాష్ట్ర 4). ఉత్తరప్రదేశ్
భారతదేశంలో విస్తీర్ణంపరంగా అతిచిన్న రాష్ట్రాలు వరుసగా, 1). గోవా 2). సిక్కిం 3). త్రిపుర 4). మణిపూర్
భారతదేశంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం "అండమాన్ నికోబార్ దీవులు ".
భారతదేశంలో విస్తీర్ణపరంగా అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం "లక్షదీవులు "
"రాజస్థాన్ " రాష్ట్రం భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం
" గోవా " రాష్ట్రం భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిచిన్న రాష్ట్రం
భారతదేశంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద నగరం " కోల్ కత్తా " గా చెప్పబడుతున్నది.
రాబోయే రోజుల్లో మీ RRB NTPC మరియు GROUP - D ఎగ్జామ్స్ కు కావాల్సిన మరెన్నో అంశాలను మీకు మనందరి "TELUGUCOMPETITIVE. COM" అందిస్తుంది అని తెలుపుటకు సంతోషిస్తున్నాము..
"" సాధనాత్ సాధ్యతే సర్వమ్ ""
0 Comments