BECIL నుంచి కేంద్ర ప్రభుత్వ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల :
గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో ఉన్న బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL)నుంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భోపాల్ లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఈ పోస్టులకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు నని ఈ ప్రకటనలో తెలిపారు.
ఈ ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భోపాల్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : మే 31, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్స్ - 28
కేటగిరీ ల వారీగా ఖాళీలు :
UR - 13
OBC - 4
SC - 6
ST - 2
EWS - 3
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 28 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
మెడికల్ రికార్డ్స్ విభాగంలో బీ. ఎస్సీ (B.Sc)కోర్సు ను పూర్తి చేసి ఉండవలెను. లేదా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2(సైన్స్ విభాగం) పూర్తి చేసి , మెడికల్ రికార్డు లో 6నెలల డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు హాస్పిటల్ లో మెడికల్ రికార్డు సెట్ అప్ లో 2 సంవత్సరాలు అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు.
పై అర్హతలతో పాటు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కంప్యూటర్ యూస్ ఎబిలిటీ, ఆఫీస్ అప్లికేషన్స్ పై అవగాహన మరియు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ నిమిషానికి 35పదములు , హిందీ టైపింగ్ స్పీడ్ నిమిషానికి 30 పదములు ఉండాలని ప్రకటనలో పొందుపరచడం జరిగింది.
ఈ పోస్టులకి లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును అని తెలుపుతున్నారు.
వయసు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18- 30 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు.గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఈ పోస్టులకు వయో పరిమితి (ఏజ్ రిలాక్స్యేషన్ )సడలింపు కూడా కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ విధానము ద్వారా అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజును కేటగిరీల వారీగా ఈ క్రింది విధంగా పొందుపరిచారు.
జనరల్ /ఓబీసీ కేటగిరీ /ఎక్స్ -సర్వీస్ మెన్ అభ్యర్థులకు 750 రూపాయలు మరియు ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 500 రూపాయలను దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు (1:7)రేషియో లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది.
జీతం :
ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 23,550 రూపాయలు జీతం అందనుంది. ఈ జీతం తో పాటు ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు EPI /ESI/బోనస్ లాంటి తదితర బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి.
NOTE :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటపుడు అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది మెయిల్ అడ్రస్ మరియు ఫోన్ నంబర్ ను సంప్రదించవచ్చును.
ఈ మెయిల్ అడ్రస్ 1:
khuswindersingh@becil.com
ఈ మెయిల్ అడ్రస్ 2:
maheshchand@becil.com
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
0120-4177850.
0 Comments