Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Visakhapatnam port Trust Jobs || విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో ఉద్యోగాలు

పరీక్ష లేదు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో ఉద్యోగాలు, జీతం 75,000 రూపాయలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ డివిజన్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.

భారీ స్థాయిలో జీతములు లభించే ఈ విశాఖపట్నం పోర్ట్ లో ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయనున్నారు .

ప్రస్తుతం ఉన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులలో వచ్చిన ఈ ఉద్యోగ ప్రకటనను నిరుద్యోగ అభ్యర్థులందరికీ ఒక మంచి సువర్ణవకాశంగా చెప్పవచ్చును.



ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేది           :   మే  31 , 2021

ఇంటర్వ్యూ నిర్వహణ సమయం   :  ఉదయం 11గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

CME 's Conference hall, 2nd Floor,

Administration Office Building,

Visakhapatnam.

విభాగాల వారీగా ఖాళీలు :

నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్               -      1

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్                    -     1

డేటా అడ్మినిస్ట్రేటర్                       -     1

ఐటీ స్పెషలిస్ట్ సర్వీసెస్                  -     1

ఐటీ స్పెషలిస్ట్ సర్వీసెస్                   -    1

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్   విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి నాలుగు సంవత్సరాల  బీ. ఈ /బీ. టెక్ మరియు ఎం. ఈ /ఎం. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు  కంప్యూటర్ నాలెడ్జ్  సంబంధిత విభాగాలలో  అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలకు మించరాదు అని ప్రకటనలో పొందుపరిచారు.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 50,000 రూపాయలు నుండి 80,000 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.

NOTE :

ఈ పోస్టుల భర్తీకి నిర్వహించబోయే ఈ ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు ఈ క్రింది ఇవ్వబడిన పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావలెను.

ఒరిజినల్ విద్యా అర్హత  సర్టిఫికెట్స్

రెస్యూమ్

రెండు సెట్స్ విద్యా  అర్హత సర్టిఫికెట్స్ జెరాక్స్ కాపీలు

ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్

రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.


సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

0891-2873200

0891-2873447

0891-2873136





Post a Comment

1 Comments