Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Chennai Metro Jobs | చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి రైల్వే ఉద్యోగాలు

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నుండి రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రకటన :

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు సంయుక్త ఆధ్వర్యంలో ఉన్న 'చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్' నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.

ఎటువంటి వ్రాత పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ రైల్వే పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

భారీ స్థాయిలో మంచి వేతనాలు మరియు ఇతర బెనిఫిట్స్ లభించే ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో తెలిపారు.


ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేది : జూన్ 4, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

జనరల్ మేనేజర్ (కన్స్ట్రక్షన్ )                                     - 3

అడిషనల్ జనరల్ మేనేజర్ (సేఫ్టీ)                            - 1

అడిషనల్ జనరల్ మేనేజర్ (లీగల్ )                            - 1

అడిషనల్ జనరల్ మేనేజర్ (QA&QC)                   -  1

డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ /అకౌంట్స్ )    - 2

అర్హతలు :

జనరల్ మేనేజర్(కన్స్ట్రక్షన్ ) ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ విభాగంలో బీ. ఈ /బీ. టెక్ కోర్సులను కంప్లీట్ చేసి ఉండవలెను. సంబంధిత విభాగంలో 23 సంవత్సరాలు అనుభవం అవసరం అని తెలుపుతున్నారు.

అడిషనల్ జనరల్ మేనేజర్ (సేఫ్టీ ) పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి B. E /B. Tech (బీఈ /బీ. టెక్ ) ఇంజనీరింగ్ కోర్సులను పూర్తి చేసి ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగంలో ఒక సంవత్సరం పీజీ /డిప్లొమా కోర్సును పూర్తి చేయవలెను.సంబంధిత విభాగంలో 17సంవత్సరాలు అనుభవం అవసరం అని తెలియచేసారు.

అడిషనల్ జనరల్ మేనేజర్ (లీగల్ ) పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 50%మార్కులతో లా గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేయవలెను.17సంవత్సరాలు అనుభవం అవసరం అని తెలియచేసారు.

అడిషనల్ జనరల్ మేనేజర్ (QA/QC) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బీ. ఈ /బీ. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను.ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధిత విభాగంలో గరిష్టంగా 17సంవత్సరాలు మరియు కనిష్టంగా 5సంవత్సరాలు అనుభవం అవసరం అని తెలిపారు.

ఇక చివరిగా డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ &అకౌంట్స్)ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి చార్టెర్డ్ అకౌంట్స్ (CA) కోర్సును పూర్తి చేయాలి.సంబంధిత విభాగంలో 18సంవత్సరాలు అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించరాదు.

ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరిలకు చెందిన అభ్యర్థులు 2 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ఈ మెయిల్  మరియు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయవలెను.

ఆఫ్ లైన్ విధానంలో పంపబడే దరఖాస్తు ఫారమ్, ఇతర విద్యా అర్హతల సర్టిఫికెట్స్ ను నిర్ణిత గడువు తేదీలోగా ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు కూడా స్కాన్ చేసి పంపవలెను.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

దరఖాస్తు ఫీజు :

దరఖాస్తు ఫీజుగా జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలు, ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 50 రూపాయలు చెల్లించవలెను. దివ్యంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్స్ ద్వారా ఎంపిక చేయనున్నారు.

జీతములు :

కేటగిరీ ల వారీగా ఈ రైల్వే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా భారీ స్థాయిలో 90,000 రూపాయలు నుండి 1,90,000 రూపాయలు వరకు మంచి స్థాయి జీతములు అందనున్నాయి.

ఈ జీతంతో పాటు ఎంపికైన అభ్యర్థుల విద్యా అర్హతలు మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా మెడికల్ & ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్, మొబైల్ ఫోన్ రియింబర్స్మెంట్, వార్షిక బోనస్ లాంటి గొప్ప గొప్ప సౌకర్యాలు కూడా లభించనున్నాయి అని ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

Website

Notification


Post a Comment

0 Comments