పరీక్ష మరియు ఇంటర్వ్యూలు లేవు, అద్భుతమైన నోటిఫికేషన్, DRDO లో అప్ప్రెంటీస్ ఉద్యోగాలు " మెరిట్ ద్వారా నియామకాలు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ లేబర్యాటరీ, జోద్ పూర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ షిప్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూ లు లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కారణంగా ఈ DRDO అప్ప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించడం లేదు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాలను కేవలం మెరిట్ ద్వారా భర్తీ చేయడం అనునది ఇరు తెలుగు రాష్ట్రముల నిరుద్యోగ అభ్యర్థులు అందరికి ఒక మంచి సువర్ణవకాశంగా చెప్పవచ్చు.
అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.
ఈ అప్ప్రెంటీస్ ఉద్యోగాలను 2021-22 సంవత్సరానికి గాను DRDO ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది : జూన్ 15 , 2021
విభాగాల వారీగా ఖాళీలు :
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 2
మెకానిక్ డీజీల్ - 2
కార్పెంటర్ - 2
ప్లంబర్ - 1
వెల్డర్ - 1
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ (ICTSM) - 2
టర్నర్ - 1
మెషినిస్ట్ - 1
ఫిట్టర్ - 1
ఎలక్ట్రీషియన్ - 1
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ (COPA) - 20
స్టేనోగ్రాఫర్ & సెక్రటరియేల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్ ) - 8
స్టేనోగ్రాఫర్ & సెక్రటరియేల్ అసిస్టెంట్ (హిందీ ) - 2
కంప్యూటర్ హార్డ్ వేర్ & నెట్ వర్క్ మెయింటనెన్స్ - 3
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 47 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్స్ లలో ఐటీఐ కోర్సులను 2018,2019,2020 విద్యా సంవత్సరాలలో పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
15 నుండి 24 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ఈ మెయిల్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ఈ క్రింది లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విద్యా అర్హతలు మరియు దరఖాస్తు విధానముల గురించి మరింత ముఖ్యమైన సమాచారం తెలుసుకోవాలంటే ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
విద్యా అర్హతల మెరిట్ మరియు షార్ట్ లిస్ట్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి కరమైన జీతములు అందనున్నాయి.
NOTE :
ఈ ఉద్యోగాల దరఖాస్తు విషయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
0291- 2510275
రిజిస్ట్రేషన్ లింక్ :
https://apprenticeshipindia/org/course-search
ఈ మెయిల్ అడ్రస్ :
director@dl.drdo.in
0 Comments