బిగ్ అప్డేట్, ఏపీపీఎస్సీ ద్వారా 1180 గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి ఆగష్టు లో నోటిఫికేషన్, కేటగిరిలా వారీగా భర్తీ చేయనున్న గ్రూప్స్ పోస్టుల లిస్ట్ ఇదే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాల భర్తీకోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన కీలక అప్డేట్ తాజాగా విడుదల అయినది.
ఆర్థిక శాఖ నుండి అనుమతి రాగానే, ఈ 1180 పోస్టులతో పాటు, మరికొన్ని ఉద్యోగాలను కలుపుకుని ఆగష్టు నెలలో ఏపీపీఎస్సీ భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఈ సారి ఉద్యోగాల భర్తీలో కేవలం ఒకే ఒక్క పరీక్ష ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు, గ్రూప్ 1 పరీక్ష మినహా మిగిలిన పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యులు అభ్యర్థులకు తెలిపారు.
దీనితో ఇప్పటివరకూ కొనసాగుతున్న ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ విధానానికి ఏపీపీఎస్సీ స్వస్తి పలుకుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
కేటగిరిల వారీగా ఆగష్టు నెలలో విడుదల కానున్న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ పోస్టుల వివరాలు :
1).మెడికల్ ఆఫీసర్స్ (యూనాని)ఇన్ ఆయుష్ డిపార్టుమెంటు - 26
2).మెడికల్ ఆఫీసర్స్ (హోమోయో)ఇన్ ఆయుష్ డిపార్టుమెంటు - 53
3).మెడికల్ ఆఫీసర్స్ (ఆయుర్వేద ) ఇన్ ఆయుష్ డిపార్టుమెంటు - 72
4).లెక్చరర్ ఇన్ హోమియో ఇన్ ఆయుష్ డిపార్టుమెంటు - 24
5).లెక్చరర్ ఇన్ Dr. NRS GAC ఇన్ ఆయుష్ డిపార్టుమెంటు - 3
6).జూనియర్ అసిస్టెంట్ - కమ్ -కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రెవిన్యూ డిపార్టుమెంటు - 670
7). అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇన్ వెరియస్ ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్ - 190
8). ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ - III ఇన్ ఎండో మెంట్ డిపార్టుమెంటు - 60
9).హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీస్ - 39
10). తెలుగు రిపోర్టర్ ఇన్ ఏపీ లెజీస్లాటర్ సెక్రటరియేట్ - 5
11). డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్ డిపార్టుమెంటు - 4
12). ఇంగ్లీష్ రిపోర్టర్స్ ఇన్ ఏపీ లెజీస్లాచర్ సెక్రటరియేట్ - 10
13). జూనియర్ లెక్చరర్స్ APREI సొసైటీ - 10
14). డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ APREI సొసైటీ - 5
15). అసిస్టెంట్ కన్సర్ వటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ - 9.
ఇవి కాకుండా, మరో 18 శాఖల్లో గ్రూప్ 1, 2 మరియు ఇంజనీరింగ్ క్యాడర్ స్థాయి 150 పోస్టుల భర్తీకి కూడా అనుమతులు కోరుతూ ఏపీపీఎస్సీ ఆర్థిక శాఖకు ఫైల్ ను పంపినది .
ఏపీ లో ఆగష్టు నెలలో జారీ చేయనున్న ఈ పోస్టుల ఖాళీల వివరాలను సంబంధించిన ముఖ్యమైన పీడీఎఫ్ ఫైల్ ను ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
0 Comments