స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా 25,271 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ జరుగుతుంది. దీని గురించి పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం.
భారత దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సాయుధా బలగాలలో కానిస్టేబుల్స్ మరియు అస్సాం రిఫీల్స్ లో రిఫిల్స్ మెన్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటనను ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా విడుదల చేసింది.
ఈ పోస్టులను జనరల్ డ్యూటీ క్యాడర్ లో ఫిల్ చేయనున్నారు. మహిళా అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులే అని ప్రకటనలో పొందుపరిచారు .
తాజాగా విడుదల అయిన ఈ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతం తదితర వివరాలను గురించి తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జూలై 17, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఆగష్టు 31, 2021
ఆన్లైన్ లో ఫీజుల చెల్లింపుకు చివరి తేది : సెప్టెంబర్ 2, 2021
చలానా ఫీజులు చెల్లింపులకు చివరితేది : సెప్టెంబర్ 7, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) - 7545
సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) - 8464
సశాస్త్ర సీమా భల్ (SSB) - 3806
ఇండో -టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) - 1431
అస్సాం రిఫిల్స్ (AR) - 3785
సెక్రటరియేట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) - 240
మొత్తం ఉద్యోగాలు :
ఈ ప్రకటన ద్వారా మొత్తం 25,271 సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల భర్తీని చేయనున్నారు.
అర్హతలు :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు /స్కూల్ నుండి 10వ తరగతి /మెట్రిక్యూలేషన్ ను పూర్తి చేయవలెను. NCC సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. నిర్థిష్ట శారీరక ప్రమాణాలు అవసరం అని ప్రకటనలో తెలిపారు.
వయసు :
18 నుండి 23 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలేక్సషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 100 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
మహిళలు, మాజీ సైనికులు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్(CBE), ఫీజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (PET), ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎక్సమినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతంగా 21,700 రూపాయలు లభించనుంది.
తెలుగు రాష్ట్రాలల్లో కేటాయించబడిన పరీక్ష కేంద్రాలు :
ఆంధ్రప్రదేశ్ :
చీరాల , గుంటూరు,కాకినాడ, కర్నూల్,నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణ :
కరీంనగర్, వరంగల్ మరియు హైదరాబాద్.
0 Comments