10వ తరగతి అర్హతలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో 458 పోస్టులు , జీతం 92,300 రూపాయలు వరకూ జీతం వస్తుంది దీని గురించి పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న 41 FAD, C/O: 56 APO లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
మంచి వేతనాలు లభించే ఈ డిఫెన్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, ఫీజు మరియు ఎంపిక, జీతం తదితర ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జూలై 10-16, 2021
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఆగష్టు 5, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
ట్రేడ్స్ మెన్ మేట్ - 330
JOA - 20
మెటీరియల్ అసిస్టెంట్ - 19
MTS - 11
ఫైర్ మెన్ - 64
255(I)ABOU ట్రేడ్స్ మాన్ మేట్ - 14
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 458 పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు /యూనివర్సిటీ నుండి 10వ తరగతి /ఇంటర్ /గ్రాడ్యుయేషన్ /డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్ మెంట్ కోర్సులను పూర్తి చేయవలెను.
నిర్థిష్టమైన శారీరక ప్రమాణాలు అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలేక్సషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
రాత పరీక్ష , మెడికల్ పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,000 రూపాయలు నుండి 92,300 రూపాయలు వరకూ జీతం అందనుంది.
Note :
ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష సిలబస్ ఈ క్రింది విధంగా ఉంది. మొత్తం ప్రశ్నపత్రాన్ని 150 మార్కులకు నిర్వహించనున్నారు.
జనరల్ ఇంటెలిజెన్స్ & రీసనింగ్ - 25 మార్కులు
న్యూమారికల్ ఆటిట్యూడ్ - 25 మార్కులు
జనరల్ ఇంగ్లీష్ - 50 మార్కులు
జనరల్ అవేర్నెస్ - 50 మార్కులు
0 Comments