భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రయివేట్ లిమిటెడ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 1,26,000 రూపాయలు వరకూ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన సబ్సిడైరీ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రయివేట్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, బెంగళూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
1). ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంస్థకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). రెగ్యులర్ పద్దతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
3). భారీ స్థాయిలో జీతములు లభించనున్నాయి.
మంచి స్థాయిలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
తాజాగా విడుదలైన ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంబంధిత సంస్థలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : నవంబర్ 19, 2021
ఆన్లైన్ వ్రాత పరీక్షల నిర్వహణ తేది : డిసెంబర్, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
డిప్యూటీ మేనేజర్స్ - 6
మేనేజర్స్ (ERP) కాంట్రాక్ట్ - 3
మొత్తం ఖాళీలు :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు లలో బీ. ఈ /బీ. టెక్ /పీజీ మొదలైన కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత సబ్జెక్టులలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయసు :
కేటగిరీ లను అనుసరించి ఈ ఉద్యోగాలకు 30 సంవత్సరాలు నుండి 50 సంవత్సరాలు వరకూ వయసు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఆయా కేటగిరీ లకు చెందిన అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలు ను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
పోస్టుల కేటగిరీ లను అనుసరించి వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్స్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 1,26,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
పరీక్ష కేంద్రాలు :
భారత దేశ వ్యాప్తంగా ఉన్న క్రింది ప్రధాన నగరాలలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వ్రాత పరీక్షలు జరుగనున్నాయి.
1). బెంగళూరు
2). చెన్నై
3). కోల్ కతా
4). న్యూ ఢిల్లీ
5). ముంబై
0 Comments