గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజషన్ (DRDO) కు చెందిన సంస్థ
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (DRDE), గ్వాలియర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
1). ఇవి కేంద్ర ప్రభుత్వ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు.
2). పరీక్షల నిర్వహణ లేదు.
3).భారీ స్థాయి జీతములు.
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా, భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. DRDO Jobs Recruitment Telugu 2021
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులే అని నోటిఫికేషన్ లో తెలుపుతున్నారు.
మంచి స్థాయిలో వేతనాలు మరియు ఇతర అలోవెన్స్ లు లభించే ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కొరకు, ఈ నోటిఫికేషన్ గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : డిసెంబర్ 9, 2021, డిసెంబర్ 10,2021
ఇంటర్వ్యూ రిపోర్టింగ్ సమయం : 9:30 AM
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
మెయిన్ గేట్ రిసెప్షన్, DRDE, ఝాన్సీ రోడ్, గ్వాలియర్ -474002.
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF- DRDO) - 11
జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) - 2
రీసెర్చ్ అసోసియేట్ (RA - DRDO) - 1
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా DRDO నుండి విడుదలైన ఈ ప్రకటన ద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టుల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు సంబంధిత విభాగాల సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ / బీ. ఈ / బీ. టెక్ /ఎంఈ /ఎం. టెక్ / ఎంఎస్సీ /పీహెచ్. డి మొదలైన కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
నెట్ / గేట్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను అని ప్రకటనలో తెలిపారు.
వయసు :
28 మరియు 35 సంవత్సరాలు వయసు లోపు గల అభ్యర్థులు అందరూ కూడా ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.
సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి (ఏజ్ రిలాక్స్యేషన్ ) సడలింపు కలదు.
దరఖాస్తు ఫీజు :
DRDO ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఇంటర్వ్యూలకు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థుల సంఖ్యను బట్టి వ్రాత పరీక్షను కూడా నిర్వహించే అవకాశం కలదు అని ఈ ప్రకటనలో తెలిపారు.
జీతం :
జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 31,000 రూపాయలు మరియు రీసెర్చ్ అసోసియేట్ (RA) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతముగా 54,000 రూపాయలు జీతం అందనుంది.
ఈ జీతముతో పాటు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) మరియు మెడికల్ ఫెసిలిటీస్ కూడా లభించనున్నాయి.
0 Comments