గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ ప్రైస్ ఆధ్వర్యంలో ఉన్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL),మహారాష్ట్ర సర్కిల్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
పరీక్ష లేదు, BSNL లో ఉద్యోగాలు, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే, వెంటనే అప్లై చేసుకోండి.
ముఖ్యంశాలు :
1). ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన పోస్టులు.
2). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
3). గౌరవ స్థాయిలో స్టై ఫండ్స్ లభించును.
4). ఈ అప్ప్రెంటీస్ షిప్ సర్టిఫికెట్స్ భవిష్యత్తులో జరగబోయే ఉద్యోగాల భర్తీకి ఉపాయుక్తంగా ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ లో భర్తీ చేసే ఈ అప్ప్రెంటీస్ షిప్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
మహారాష్ట్ర టెలికామ్ సర్కిల్ నుండి వచ్చిన ఈ తాజా నోటిఫికేషన్ గురించి ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇపుడు సంక్షిప్తంగా తెలుసుకుందాం. BSNL Vacancies Telugu 2022
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : డిసెంబర్ 14, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 29, 2021
సర్టిఫికెట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేది : జనవరి 3, 2022
సెలక్షన్ లిస్ట్ విడుదల తేది : జనవరి 5, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
డిప్లొమా అప్ప్రెంటీస్ షిప్ - 55
మొత్తం పోస్టులు :
మొత్తం 55 అప్ప్రెంటీస్ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ అప్ప్రెంటీస్ షిప్ లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు AICTE చే గుర్తింపు పొందిన బోర్డుల నుండి ఎలక్ట్రానిక్స్ /ఈ&టీసీ /కంప్యూటర్ /ఐటీల ఇంజనీరింగ్ /టెక్నాలజీ విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ఉండవలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
25 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు ( ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతల మార్కుల పెర్సెంటేజ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు గౌరవ స్థాయిలో నెలకు 8,000 రూపాయలు స్టై ఫండ్ లు లభించనున్నాయి.
(APSSDC) తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది. Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
0 Comments