గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైస్ కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ ఆధ్వర్యంలో ఉన్న మినీరత్న కంపెనీ అయిన కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1).ఇవి కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఉద్యోగాలు.
2). గౌరవ స్థాయిలో జీతములు.
3). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 28, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
మెకానికల్ | 1 |
ఎలక్ట్రికల్ | 2 |
ఎలక్ట్రానిక్స్ | 3 |
ఇన్స్ట్రుమెంటేషన్ | 1 |
సివిల్ | 4 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | 3 |
కమర్షియల్ | 2 |
ఫైనాన్స్ | 2 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 18 ఉద్యోగాలను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి 60% మార్కులతో మెకానికల్ /ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్ /ఇన్స్ట్రుమెంటేషన్ /సివిల్ /కంప్యూటర్ టెక్నాలజీ /కమర్షియల్ ప్రాక్టీస్ విభాగాలలో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులు /బాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ /మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ మొదలైన కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు కంప్యూటర్ నాలెడ్జ్, సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
30 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
ఓబీసీ / జనరల్ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలు ను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
మిగిలిన కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ మరియు డిస్క్రిప్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఈ పరీక్షలలో జనరల్ నాలెడ్జ్, రీసనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ తదితర అంశాలను అడగనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 24,400 రూపాయలు నుండి 25,900 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
ఈ జీతంతో పాటు ఎక్సట్రా వర్క్ హావర్స్ కు నెలకు 5,400 రూపాయలు వరకూ లభించే అవకాశాలు ఉన్నాయి.
వైజాగ్ లో డిసెంబర్ 27 జాబ్ మేళా Click Here
Union Bank లో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments