ప్రముఖ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై సెంట్రల్ ఆఫీస్ కు చెందిన మాన్ పవర్ ప్లానింగ్ అండ్ రిక్రూట్మెంట్ డివిజన్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ /డోమైన్ ఎక్స్ పర్ట్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కాంట్రాక్టు బేసిస్ ఉద్యోగాలు.
2). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
3). గౌరవ స్థాయిలో వేతనాలు.
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా భర్తీ చేసే ఈ పోస్టుల భర్తీకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం. Union Bank jobs Recruitment 2022 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : డిసెంబర్ 18, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 7, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
డిజిటల్ టీమ్ :
సీనియర్ మేనేజర్ - 1
మేనేజర్ - 1
ఎనాలిటిక్స్ టీమ్ :
మేనేజర్ - డేటా సైంటిస్ట్ - 2
మేనేజర్ - డేటా ఎనాలిస్ట్ - 2
మేనేజర్ - స్టాటీష్టిషియన్ - 2
మేనేజర్ - డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ - 1
ఎకనామిస్ట్ టీమ్ :
సీనియర్ మేనేజర్ - 2
మేనేజర్ - 2
రీసెర్చ్ టీమ్ :
సీనియర్ మేనేజర్ (ఇండస్ట్రీ రీసెర్చ్ ) - 2
మేనేజర్ ( ఇండస్ట్రీ రీసెర్చ్ ) - 2
API మేనేజ్ మెంట్ టీమ్ :
సీనియర్ మేనేజర్ - 2
మేనేజర్ - 2
డిజిటల్ లెండింగ్ & ఫిన్ టెక్ టీమ్ :
సీనియర్ మేనేజర్ - 2
మేనేజర్ - 2
మొత్తం పోస్టులు :
వివిధ కేటగిరీ లలో మొత్తం 25 పోస్టులను ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులకు కల్పించనున్నారు.
అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు ల నుండి 60% మార్కులతో బీ. ఈ /బీ. ఎస్సీ (కంప్యూటర్ సైన్స్ ), ఎంసీఏ /ఐటీ /డేటా సైన్స్ /మెషిన్ లెర్నింగ్ /ఏఐ/ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ /డేటా అనాలిటిక్స్ /ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ /ఐటీ /ఈసీఈ /ఎంసీఏ/ఎం. ఎస్సీ (ఐటీ)/ఎం. ఎస్సీ (కంప్యూటర్ సైన్స్ )ఎకనామిక్స్ విభాగంలో పీజీ /ఎంబీఏ/ఎం. ఫీల్ /పీ. హెచ్డీ /ఎం. ఏ (ఎకనామిక్స్ )/బీ. ఈ /ఎం. బీ. ఏ (మార్కెటింగ్ ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటన లో పొందుపరిచారు.
వయసు :
25 సంవత్సరాలు వయసు నుండి 40 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులకు 10/15 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /EWS/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 800 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /దివ్యంగులు 150 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్ట్ / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ ల వారీగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు విద్యా అర్హతలను బట్టి ప్రారంభ జీతముగా 20,000 రూపాయలు పైన లభించనున్నాయి.
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
0 Comments