నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ సెక్టర్ ఉద్యోగాలు, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఆంధ్రప్రదేశ్, గుంటూరులో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్టుల భర్తీ.
2). ఇవి కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఉద్యోగాలు.
3).7th సీపీసీ విధానంలో మంచి స్థాయిలో జీతములు లభించును.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ స్టేట్ లో ఉన్న గుంటూరు లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
NID లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 19,2021.
విభాగాల వారీగా ఖాళీలు :
సీనియర్ ఇంజనీర్ (LBM) - 1
హెడ్ సెక్యూరిటీ సర్వీసెస్ - 1
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్ ) - 1
అసిస్టెంట్ ఇంజనీర్ (ఐటీ ) - 1
వార్డెన్ (ఫిమేల్ ) - 1
మొత్తం పోస్టులు :
మొత్తం 5 పోస్టులను తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో అనగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ /కంప్యూటర్ ఇంజనీరింగ్ మొదలైన తదితర విభాగాలలో డిగ్రీ /బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.
కంప్యూటర్ నాలెడ్జ్ మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 35 మరియు 56 సంవత్సరాలకు మించరాదు.
వార్డెన్ పోస్టులకు ఎటువంటి వయసు పరిమితి నిబంధన లేదు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /దివ్యంగులు /మహిళలు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7th సీపీసీ విధానంలో ఆకర్షనీయమైన జీతములు లభించనున్నాయి.
సుమారుగా ప్రారంభ జీతం 30,000 రూపాయలు పైన ఉద్యోగార్థులకు లభించనుంది.
సంప్రదించవలసిన చిరునామా :
The Chief Administrative Officer,
National Institute of Design Andhra Pradesh,
Transit Campus : EEE & ECE Building,
Acharya Nagarjuna University, Nagarjuna Nagar,
Namburu,
Gunturu,
Andhra Pradesh - 522510.
0 Comments