ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు నూతన చైర్మన్ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.
రెండు రోజుల క్రితం డీజీపీ పదవి నుండి బదిలీ అయిన శ్రీ గౌతమ్ సవాంగ్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్మన్ గా నియమిస్తూ ఏపీ గవర్నమెంట్ తమ నిర్ణయాన్ని ప్రకటించింది.
దీనితో ఇప్పటి వరకూ ఖాళీగా ఉన్న ఏపీపీఎస్సీ చైర్మన్ పదవీ ను భర్తీ చేయడం జరిగింది.
ఏపీపీఎస్సీ చైర్మన్ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫైల్స్ అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. APPSC Latest News
ఈ తరుణంలో ఏపీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ - 1 మరియు గ్రూప్ - 2 పోస్టుల భర్తీ, మరియు ఏపీ రెవిన్యూ డిపార్టుమెంటు లో ఖాళీగా ఉన్న 670 పోస్టుల భర్తీకి నిర్వహించే వ్రాత పరీక్షలు మరియు ఏపీ
ఎండో మెంట్ డిపార్టుమెంటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ - 3 పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీలను అతి త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
APPSC ఉద్యోగాల గురించి మరెన్నో న్యూస్ ల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. Click Here
0 Comments