ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ లో వివిధ విభాగాలలో, భారీ సంఖ్యలో 2,588 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో 39 వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుండగా ఇందులో 27 వేల పోస్టుల భర్తీ పూర్తి అయినట్లు, ఇంకా మిగిలిన పోస్టులను ఈ నెల చివరికి భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రకటిస్తున్న ఈ 2,588 పోస్టుల భర్తీని సత్వరమే చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తాజాగా భర్తీ చేయనున్న ఈ 2588 పోస్టులు విభాగాల వారీగా ఈ క్రింది విధంగా ఉండబోతున్నట్లుగా తాజాగా జారీ చేసిన ఈ ప్రకటనలో తెలిపారు. AP 2588 Jobs Update Telugu
విభాగాల వారీగా ఖాళీలు :
| పోస్ట్ లు | ఖాళీలు |
|---|---|
| డాక్టర్ | 485 |
| నర్సింగ్ | 60 |
| ఫార్మసీ | 78 |
| పారామెడికల్ క్లాస్ -4 | 644 |
| ల్యాబ్ టెక్నీషియన్ | 279 |
| పోస్ట్ మార్టం సహాయకులు | 39 |
| ఆసుపత్రి పరిపాలన విభాగం | 54 |
| ఇతరత్రా పోస్టులు | 949 |
పైన తెలుపబడిన 2,588 పోస్టులను శాశ్వత,కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. మరికొన్నిటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నట్లు ఈ ఉత్తర్వుల లో పొందుపరిచారు.
AP లో మరెన్నో ఉద్యోగాలు Click here
0 Comments