గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గుంటూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). భారీ స్థాయిలో జీతములు.
3). వీటిని కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు.
గుంటూరు, గవర్నమెంట్ హాస్పిటల్ లో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాల దరఖాస్తు తేదీలు, విద్యా అర్హతలు, ఎంపిక విధానాలు తదితర అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఫిబ్రవరి 14-15, 2022 (5PM).
భర్తీ చేయనున్న పోస్టులు :
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - II
ఫార్మాసిస్ట్ గ్రేడ్ - II
ఆప్తోమెట్రిస్ట్
రిఫ్రాక్షనిస్ట్
స్పీచ్ థెరపిస్ట్
ఈసీజీ టెక్నీషియన్
కేత్ ల్యాబ్ టెక్నీషియన్
రేడియోగ్రాఫర్
డార్క్ రూమ్ అసిస్టెంట్
డైయాలసిస్ టెక్నీషియన్
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టుల విభాగాలలో 10వ తరగతి / ఇంటర్మీడియట్ /డిప్లొమా /డిగ్రీ /బీ. ఫార్మసీ తదితర కోర్సులను పూర్తి చేసి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
42 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఓసీ /బీసీ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతల మార్కులు మరియు మెరిట్, అనుభవం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 15,000 నుండి 28,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపివల్సిన చిరునామా ( అడ్రస్ ) :
The Superintendent,
Government General Hospital,
Guntur,
Andhra Pradesh.
0 Comments