విశాఖపట్నం లో క్యాషియర్స్, టెలి కాలింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, 5రోజుల్లో పోస్టింగ్స్, ఈ క్రింది లింక్ ద్వారా అప్లై చేసుకోండి.
ప్రముఖ వాణిజ్య మరియు వ్యాపార సంస్థలైన ట్రై జియో టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్, హ్యాపీ మొబైల్స్ తదితర సంస్థల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
ముఖ్యాంశాలు :
1). ఈ పోస్టులను APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేయనున్నారు.
2). పేర్మినెంట్ గా ఉద్యోగాలను చేసుకునే అవకాశం కలదు.
3). భారీ స్థాయిలో జీతములు మరియు ఇన్సెంటివ్స్ + బోనస్ లు కూడా లభించనున్నాయి.
ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మరియు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఏపీఎస్ఎస్డీసీ నుండి తాజాగా వచ్చిన ఈ ప్రకటన లో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను గురించి సవివరంగా తెలుసుకుందాం. Vizag Executive Jobs 2022
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ : ఫిబ్రవరి 16, 2022
నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
SVVP VMC డిగ్రీ కాలేజీ , MVP కాలనీ, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్.
పాల్గొను సంస్థలు :
ట్రై జియో టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్
హ్యాపీ మొబైల్స్
బీడేటా టెక్నాలజీస్
STS వెల్త్
జాబ్ రోల్స్ - ఖాళీలు :
| పోస్ట్ లు | ఖాళీలు |
|---|---|
| CAD /GIS ఇంజనీర్ | 100 |
| క్యాషియర్స్ | 10 |
| స్టోర్ మేనేజర్స్ | 4 |
| సేల్స్ ఎగ్జిక్యూటివ్ | 20 |
| ఆడిట్స్ & అకౌంట్స్ | 4 |
| వేర్ హౌస్ / అసిస్టెంట్ | 5 |
| ఐటీ రిక్రూటర్లు | 10 |
| బ్రాంచ్ సేల్ రిక్రూటర్ | 10 |
| గ్రాఫిక్ డిజైనర్ | 4 |
| ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ | 15 |
| టెలి కాలింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ | 10 |
మొత్తం పోస్టులు :
192 పోస్టులను తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
కేటగిరీ లను అనుసరించి ఇంటర్మీడియట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ కోర్సులు/డిప్లొమా /బీ. టెక్ /ఎంబీఏ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూల విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 రూపాయలు నుండి 25,000 రూపాయలు వరకూ జీతం + ఇన్సెంటివ్స్ + ట్రావెల్ ఎక్సపెన్సెస్ +వసతి సౌకర్యాలు లాంటి బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి.
కావాల్సిన ద్రువపత్రాలు :
రెస్యూమ్స్
ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జీరాక్స్
ఆధార్ కార్డ్స్
గమనిక :
ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు కోవిడ్ - 19 ప్రోటోకాల్స్ ను పాటించవలెను.
మాస్క్ మరియు శానిటైజర్స్ ను తమ వెంట తెచ్చుకోవాలని అభ్యర్థులకు ఈ ప్రకటనలో తెలిపారు.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
94947 91935
79811 02224
9988853335
0 Comments