ఇండియన్ కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, విశాఖపట్టణం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ లో పోస్టుల భర్తీ.
3). అతి తక్కువ విద్యా అర్హతలు మాత్రమే అవసరం.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నం లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
వైజాగ్ నుండి వచ్చిన ఈ పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మార్చి 30, 2022.
పరీక్ష నిర్వహణ తేది : ఏప్రిల్ / మే 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
ఎన్ రోల్డ్ ఫాలోవర్ /సఫయి వాలా - 8.
అర్హతలు :
10వ తరగతి / ఐటిఐ విద్యా అర్హతలుగా కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు అభ్యర్థులు నిర్ణిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
18-25 సంవత్సరాలు వయసు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
అభ్యర్థులు మొదటగా వెబ్సైటు నుండి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, తదుపరి దరఖాస్తు ఫారం ను నింపి, సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి ఈ క్రింది చిరునామాకు ఆర్డినరీ పోస్ట్ ద్వారా నిర్ణిత గడువు చివరి తేది లోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు..?
షార్ట్ లిస్ట్, వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫీజికల్ ఫిట్ నెస్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పరీక్ష నిర్వహణ ప్రదేశం :
Coast Guard District Headquarters-6(AP)
PostBox No. 1128
Malkapuram(PO)
Visakhapatnam-530011.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 21,700 నుండి 69,100 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
The Recruitment Officer,
Indian Coast Guard District Headquarters No. 6,
PostBox No. 1128, Malkapuram (PO),
Visakhapatnam - 530011.

0 Comments