ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి యూనివర్సిటీ కు చెందిన పోస్టులు.
2). ప్రాజెక్ట్ సంబంధిత పోస్టులు.
3). గౌరవ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఎంపికైన అభ్యర్థులకు రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, చింతపల్లి, విశాఖపట్నం నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
అగ్రికల్చర్ యూనివర్సిటీ, వైజాగ్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ఈ ప్రకటనలోని ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Vizag NG Ranga Jobs 2022 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : మార్చి 22, 2022.
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 11గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం : ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, RARS,చింతపల్లి.
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రాజెక్ట్ / టెక్నికల్ అసిస్టెంట్ - 2
అర్హతలు :
బీ. ఎస్సీ ( అగ్రికల్చర్ ) /బీ. ఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్ కోర్సులను పూర్తి చేసి, ఫీల్డ్ వర్క్, ప్లాంట్ డేటా రికార్డింగ్, మైక్రో సాఫ్ట్ ఆఫీస్ లో నాలెడ్జ్ ను కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
35 సంవత్సరాలు వయసు కలిగిన పురుషులు మరియు 40 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు అని ఈ ప్రకటన ద్వారా తెలుపుతున్నారు.
దరఖాస్తు విధానం :
ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ తమ బయో డేటా, నేమ్ & అడ్రస్, లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, సంబంధిత విద్యా దృవీకరణ పత్రాల ఒరిజినల్స్ మరియు ఫోటో కాపీస్ ను ఇంటర్వ్యూ నిర్వహణ సమయాలలో సమర్పించవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 20,000 రూపాయలు మరియు 9% హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (హెచ్. ఆర్. ఏ ) వంటి సౌకర్యాలు లభించనున్నాయి.
0 Comments