ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లాలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటన కలెక్టర్ కార్యాలయం, ఒంగోలు నుండి తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి గవర్నమెంట్ కు చెందిన బ్యాక్ లాగ్ పోస్టులు.
2). విభిన్న ప్రతిభావంతులు మాత్రమే దరఖాస్తులకు అర్హులు.
3). జూనియర్ అసిస్టెంట్, అటెండర్ తదితర పోస్టుల భర్తీ.
4). 5వ తరగతి & 7వ తరగతి అర్హతలతో కూడా పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. AP Collectorate Jobs 2022
ఒంగోలు జిల్లా నుండి వచ్చిన ఈ తాజా ప్రకటన గురించి మరింత ముఖ్యమైన సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఏప్రిల్ 12, 2022, (5PM).
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ అసిస్టెంట్ - 2
మాట్రన్ కమ్ స్టోర్ కీపర్ - 1
ల్యాబ్ అటెండెన్స్ - 1
అటెండర్ - 1
వాటర్ వర్క్ హెల్పర్ - 1
వాచ్ మెన్ /స్వీపర్/గార్డ్ నర్ - 1
మొత్తం పోస్టులు :
7 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి ఏదైనా డిగ్రీ ఉత్తిర్ణత తో పాటు కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానం కలిగి ఉన్న అభ్యర్థులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏదైనా డిగ్రీ అర్హతలుగా కలిగి ఉన్న అభ్యర్థులు మాట్రన్ కమ్ స్టోర్ కీపర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
10వ తరగతితో పాటు ఇంటర్ ఒకేషనల్ కోర్సు నందు మెడికల్ ల్యాబ్ అటెండెన్స్ కోర్సు నందు ఉత్తిర్ణత అయిన అభ్యర్థులు ల్యాబ్ అటెండెన్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
7వ తరగతి విద్యా అర్హతగా కలిగి ఉన్న అభ్యర్థులు అటెండర్, వాటర్ వర్కర్ హెల్పర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
5వ తరగతి విద్యా అర్హతలుగా కలిగి ఉన్న అభ్యర్థులు వాచ్ మెన్ /స్వీపర్ /గార్డెనర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18-52 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది అడ్రస్ కు తమ తమ దరఖాస్తు ఫారం నకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి నిర్ణిత గడువు చివరి తేదిలోగా సమర్పించవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు :
కేటగిరీలను అనుసరించి పోస్టులకు కంప్యూటర్ టెస్ట్ / అకాడమిక్ మెరిట్, అభ్యర్థుల వయసు, అంగవైకల్యం, ఎంప్లొయ్ మెంట్ సీనియరిటీ ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతములు లభించనున్నాయి.
దరఖాస్తులు పంపించవల్సిన అడ్రస్ ( చిరునామా ) :
సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ, ప్రకాశం భవనం, ఒంగోలు.

0 Comments