సువర్ణవకాశం, బ్యాంక్ మరియు గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శుభవార్త, తిరుపతి మరియు విజయవాడలలో ఉచితంగా(ఫ్రీ) కోచింగ్, పూర్తి వివరాలను ఇప్పుడే తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో భర్తీ కానున్న గ్రూప్స్ ఉద్యోగాలకు మరియు బ్యాంకింగ్ పీఓ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త.
బ్యాంకింగ్ పీఓ మరియు గ్రూప్ 1 పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రెసిడెన్సీయల్ ఫ్రీ కోచింగ్ ను ఇవ్వడానికి గానూ, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంటు, ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ నుండి ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా వెలువడినది.
ఈ ఫ్రీ రెసిడెన్సీయల్ కోచింగ్ కు సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 10, 2022.
విద్యా అర్హతలు :
ఏదైనా విభాగాలలో గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేయవలెను.
ఎవరూ అర్హులు :
కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయలకి మించకుండా ఉన్న ఎస్సీ /ఎస్టీ / ఇతర వర్గాల నిరుద్యోగ గ్రాడ్యుయేట్ లు అందరూ ఈ ఫ్రీ రెసిడెన్సీయల్ ఫ్రీ కోచింగ్ కు అర్హులే అని ప్రకటనలో పొందుపరిచారు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది వెబ్సైటు లింక్ ను క్లిక్ చేసి అభ్యర్థులు ఈ ఫ్రీ కోచింగ్ కు దరఖాస్తులు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు..?
ఆన్లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహణ ద్వారా ఈ ఉచిత రెసిడెన్సీయల్ కోచింగ్ కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఉచిత శిక్షణ అందించే ప్రదేశాలు :
బ్యాంకింగ్ పీఓ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఏపీ స్టడీ సర్కిల్ బ్రాంచ్, తిరుపతి నగరంలోనూ, మరియు గ్రూప్ 1 పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఏపీ స్టడీ సర్కిల్ బ్రాంచ్, విజయవాడ లో ఫ్రీ రెసిడెన్సీయల్ కోచింగ్ ను ఇవ్వనున్నారు.
శిక్షణ - ముఖ్యాంశాలు :
అభ్యర్థులు ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే గ్రూప్ 1 మరియు బ్యాంకింగ్ పీఓ పోస్టులకు ఈ ఫ్రీ రెసిడెన్సీయల్ కోచింగ్ ను పొందవచ్చును.
ఈ కోచింగ్ కాల వ్యవధి ముగిసే వరకూ అభ్యర్థులకు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలును కూడా కల్పించనున్నట్లుగా తెలుస్తుంది.

0 Comments