భారతదేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఒక శుభవార్తను అందిస్తూ ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక అతి ముఖ్యమైన ప్రకటనను తాజాగా చేసినది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే కరవు భత్యం (డీఏ) మూడు శాతం ( 3%) పెంచుతున్నట్లుగా భారత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.
డీఏ 3% పెంపు నిర్ణయాన్ని మార్చి 30వ తేదీనాడు జరిగిన భారత దేశ ప్రధాన మంత్రివర్యులు ఆధ్వర్యంలో జరిగిన కాబినెట్ భేటీలో తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది.
ఈ పెరిగిన 3% డీఏ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు మరియు పెన్షన్ దారులకు ఈ ఏడాది 2022, జనవరి 1వ తేది నుండే అమలు లోనికి వస్తుందని భారతీయ కేంద్ర ప్రభుత్వం తెలిపింది. Central Govt Jobs Salary New Update
ప్రస్తుతం 31 శాతంగా ఉన్న మూల వేతనం మరియు పెన్షన్ పై 3 శాతంను పెంచడంతో 34% శాతానికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది.
భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశావ్యాప్తంగా ఉన్న 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62 లక్షల మంది పెన్షన్ దారులకు ప్రయోజనం చేకూరనున్నట్లుగా మనకు తెలుస్తుంది.
AP లో మరిన్ని ఉద్యోగాలు Click Here
TS లో మరిన్ని జాబ్స్ Click Here

0 Comments