గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై లోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
ఆర్బీఐ లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. RBI 294 Jobs Recruitment 2022
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఫీజు ప్రారంభం తేది : మార్చి 28, 2022.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఫీజు చివరి తేది : ఏప్రిల్ 18, 2022
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ (డీఆర్) జనరల్ ఆన్లైన్ పరీక్షల తేదీలు :
ఫేజ్ - I ఆన్లైన్ ఎగ్జామినేషన్ - మే 28, 2022
ఫేజ్ - II - పేపర్ I, II&III ఆన్లైన్ ఎగ్జామ్స్ - జూన్ 25, 2022
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ (డీఆర్) డీఈపీఆర్/డీఎస్ఐఎం పరీక్షల తేదీలు :
ఫేజ్ - I - పేపర్ I ఆన్లైన్ ఎగ్జామినేషన్ - జూలై 2, 2022
ఫేజ్ - II - పేపర్ II&III ఎగ్జామ్స్ తేది - ఆగష్టు 6, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ (డీఆర్) - జనరల్ - 238
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ (డీఆర్) - డీఈపీఆర్ - 31
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ (డీఆర్ ) - డీఎస్ఐఎం - 25
మొత్తం పోస్టులు :
294 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ /టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలుగా కలిగియున్న అభ్యర్థులు అందరూ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ (డీఆర్) జనరల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ /ఎంఏ లేదా ఎంఎస్సీ ఇన్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మాథ్ మేటికల్ ఎకనామిక్స్, ఫైనాన్సియల్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఇండస్ట్రీయల్ ఎకనామిక్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ /ఎంఏ, ఎంఎస్సీ ఇన్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్, మాథ మేటికల్ ఫైనాన్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఇంటర్నేషనల్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, అగ్రి బిజినెస్ ఫైనాన్స్ లేదా పీజీడీఎం/ఎంబీఏ విత్ స్పెషలైజెషన్ ఇన్ ఎకనామిక్స్ /ఫైనాన్స్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ ( డీఆర్ ) - డీఈపీఆర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మాస్టర్ డిగ్రీ ఇన్ మాథ్ మెటిక్స్ /స్టాటాస్టిక్స్ / మాథ్ మెటికల్ స్టాటాస్టిక్స్ /మాథ్ మెటికల్ ఎకనామిక్స్ /ఎకనామీట్రిక్స్ / స్టాటాస్టిక్స్ & ఇన్ఫోర్మేటిక్స్ / అప్లైడ్ స్టాటాస్టిక్స్ & ఇన్ఫర్మేటిక్స్ /ఎం. స్టాట్ డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనాలిటిక్స్ (పీజీడీబీఏ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ (డీఆర్) - డీఎస్ఐఎం పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
21-30 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ /ews కేటగిరీ అభ్యర్థులు 850 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /దివ్యంగులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు :
ఆన్లైన్ టెస్ట్ లు / ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 55,200 రూపాయలు నుండి 1,08,404 రూపాయలు వరకూ జీతం అందనుంది.
పరీక్ష సిలబస్ - వివరాలు :
జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీటివ్ అప్టిట్యూడ్, రీసనింగ్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, ఇంగ్లీష్, జనరల్ ఫైనాన్స్ అండ్ మానేజ్మెంట్ తదితర అంశాలపై ఈ పరీక్షలలో అభ్యర్థులకు ప్రశ్నలు రానున్నాయి.

0 Comments