గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో ఉన్న మహరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL),విశాఖ రీఫైనరీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2).ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
3).భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వైజాగ్ రీఫైనరీ, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు..
HPCL విశాఖపట్నం నుండి తాజాగా వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ఇతర అంశాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Vizag HPCL Jobs Recruitment 2022
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : ఏప్రిల్ 22, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మే 21, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
ఆపరేషన్ టెక్నీషియన్ - 94
బాయిలర్ టెక్నీషియన్ - 18
మైంటెనెన్సు టెక్నీషియన్ (మెకానికల్) - 14
మైంటెనెన్స్ టెక్నీషియన్ ( ఎలక్ట్రికల్ ) - 17
మైంటెనెన్స్ టెక్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్) - 9
ల్యాబ్ ఎనాలిస్ట్ - 16
జూనియర్ ఫైర్&సేఫ్టీ ఇన్స్పెక్టర్ - 18
మొత్తం ఖాళీలు :
186 కు పైగా అప్ప్రెంటీస్ షిప్ పోస్టుల భర్తీని తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఆపరేషన్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిసైరబుల్ ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ కోర్సులను కలిగిఉన్నవారు బాయిలర్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
డిప్లొమా ఇన్ మెకానికల్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు మైంటెనెన్సు టెక్నీషియన్ (మెకానికల్) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు మైంటెనెన్సు టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్/ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తి చేసిన వారందరూ మైంటెనెన్సు టెక్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.
60 % మార్కులతో బీ. ఎస్సీ (మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) లేదా ఎంఎస్సీ (కెమిస్ట్రీ) కోర్సులను పూర్తిచేసిన వారు ల్యాబ్ అనాలిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
40% మార్కులతో సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ వాలీడ్ హెచ్. ఎం. వీ లైసెన్స్ లను కలిగియున్న అభ్యర్థులు జూనియర్ ఫైర్ & సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 25 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగుల కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
యూఆర్/ఓబీసీ /ews కేటగిరీ అభ్యర్థులు 590 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 26,000 రూపాయలు నుండి 76,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
ఈ జీతంతో పాటుగా వీడిఏ, హెచ్. ఆర్. ఏ, పీ. ఎఫ్, గ్రాట్యుటీ, సూపర్ అన్న్యుయేషన్ బెనిఫిట్స్ తదితర ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
0 Comments