తెలంగాణలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నందు పని చేయుటకు బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ బోధన సిబ్బందిని గెస్ట్ టీచర్గా నియమించడం జరుగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గుండి గొల్లపల్లి, పాల్వంచ, గుండాల, టేకులపల్లి,చర్ల,దుమ్ముగూడెం,ములకలపల్లి,సింగరేణి లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో పని చేయవలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ: 10 ఆగస్టు 2022
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 16 ఆగస్టు 2022
అర్హతలు:
టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత డిగ్రీతో కనీసం 50 శాతం మార్కులతో బీఈడీ పూర్తి చేసి ఉండాలి, సిటిఈటి పేపర్ 2 పాస్ అయి ఉండాలి.
మరియు పిఈటి పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంపీఈడీ, బీపీఈడీ చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో రెండు లేదా మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
మరియు మ్యూజిక్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంగీతంలో డిప్లమో, డిగ్రీ, పీజీ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
ఆర్ట్ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బిఏ ఫైన్ ఆర్ట్స్ తో పాటు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం భద్రాచలం నందు తమ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఈ క్రింద ఇవ్వబడిన మొబైల్ నెంబర్ కి సంప్రదించగలరు.
9000309979
0 Comments