ఆంధ్రప్రదేశ్ లో AP TET పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష లో అభ్యర్థులు విజయం సాధించాలి అనే ఉద్దేశ్యంతో మంచి అద్బుతమైన బిట్స్ ప్రిపేర్ చేసి క్రింద ఇవ్వడం జరిగింది. ఈ బిట్స్ ప్రిపేర్ అవ్వడం ద్వారా మీరు ఎక్కువ మార్కులు సంపాధించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 40 బిట్స్ ప్రిపేర్ అవ్వండి.
1). జ్ఞానేంద్రియ వికాసం ఈ క్రింది ఏ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది..?
A). పూర్వ బాల్యదశ
B). ఉత్తర బాల్యదశ
C). పూర్వ కౌమర దశ.
D). శైశవ దశ.
జవాబు : D - శైశవ దశ.
2). థార్న్ డైక్ CAVD ప్రజ్ఞా పరీక్షను ఈ క్రింది దేనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు..?
A). వైఖరులు
B). మానసిక సామర్థ్యములు.
C). సహజ సామర్థ్యములు
D). శారీరక సామర్థ్యములు.
జవాబు : B - మానసిక సామర్థ్యములు.
3). ఈ క్రింది వానిలో భాషణ - భాషా సంబంధ వైకల్యం ఏది..?
A). డిస్ ఫేసియా
B). డిస్ గ్రాఫియా
C). డిస్ కాల్క్యూలియా
D). డిస్ లెక్సీయా
జవాబు : A - డిస్ ఫేసియా.
4). ఈ క్రింది ఏ సిద్దాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో ఆయత్న సిద్ధంగా ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహనా చేసుకుంటాడు..?
A). పియాజే సంజ్ఞానాత్మక వికాసం
B). బ్రూనర్ బోధన సిద్దాంతం
C). థార్న్ డైక్ యత్న దోష అభ్యసనం
D). కోల్ బర్గ్ నైతిక వికాసం
జవాబు : A - పియాజే సంజ్ఞానాత్మక వికాసం.
5). ఈ క్రింది వికాసాలలో ఏ వికాసం ముందుగా ఏర్పడుతుంది..?
A). శారీరక వికాసం
B). మానసిక వికాసం
C). ఉద్వేగ వికాసం
D). సాంఘిక వికాసం
జవాబు : C - ఉద్వేగ వికాసం.
6). ఈ క్రింది వారిలో ఏకకారక సిద్దాంతంను ప్రతిపాదించినవారు ఎవరు..?
A). బినే
B). స్పీయర్ మెన్
C). థర్ స్టన్
D). గిల్ ఫర్డ్
జవాబు : A - బినే.
7). ప్రజ్ఞా లబ్ది (IQ) 150 కన్నా ఎక్కువగా ఉన్న వారిని ఏమని పిలుస్తారు..?
A). బుద్ది హీనులు
B). తెలివి తక్కువ వారు
C). తెలివైన వారు
D). మేధావులు, ప్రతిభావంతులు.
జవాబు : D - మేధావులు, ప్రతిభావంతులు.
8). సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్రను బోధించిన ఉపాద్యాయుడు, సచిన్ క్రికెట్ లో రాణించడానికి గల కారణంను విద్యార్థులకు ఈ క్రింది వానిలో ఏది అని తెలుపుతారు..?
A). ప్రజ్ఞ
B). సృజనాత్మకత
C). సహజ సామర్థ్యం
D). అభిరుచి
జవాబు : C - సహజ సామర్థ్యం.
9). యత్న దోష అభ్యసన సిద్దాంతం (Trail and Error)ను ప్రతిపాదించినవారు ఎవరు..?
A). ఇ. ఎల్. థార్న్ డైక్
B). కోహిలర్
C). జాన్ వాట్సన్
D). పియాజే
జవాబు : A - ఇ. ఎల్. థార్న్ డైక్.
10). సినిమా హాలు లోనికి ప్రవేశించి సీట్ నెంబర్ చూసుకుని, కూర్చున్న తరువాత సీట్ నెంబర్ ను మరచిపోవడం అనేది ఈ క్రింది ఏ స్మృతి కు చెందుతుంది..?
A). తక్షణ స్మృతి
B). స్వల్పకాలిక స్మృతి
C). దీర్ఘకాలిక స్మృతి
D). బట్టి స్మృతి
జవాబు : B - స్వల్ప కాలిక స్మృతి. (Short time Memory ).
11). ప్రజ్ఞా లబ్ది (IQ) సూచించేది..?
A). వ్యక్తంతర భేదాలు
B). వ్యక్తుల మానసిక వికాసం
C). వ్యక్తంతర్గత భేదాలు
D). వ్యక్తుల శారీరక వికాసం
జవాబు : B - వ్యక్తుల మానసిక వికాసం.
12). రమ, ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్ లో చేరారు. కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క..?
A). సహజ సామర్థ్యం
B). అభిరుచి
C). ప్రజ్ఞ
D). వైఖరి
జవాబు : A - సహజ సామర్థ్యం.
13). రక్షక తంత్రాలు అనే భావనను తొలి సారిగా ప్రవేశపెట్టినవారు ఎవరూ..?
A). కార్ల్ యుంగ్
B). సిగ్మాండ్ ఫ్రాయిడ్
C). హిప్పోక్రటీస్
D). ఎడ్వార్డ్ డెల్
జవాబు : B - సిగ్మాండ్ ఫ్రాయిడ్.
14). ఈ క్రింది వానిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి..?
A). సామాన్యికరణ సిద్దాంతం
B). బోధనా సిద్దాంతం
C). ఆదర్శల సిద్దాంతం
D). ట్రాన్స్ పొజిషన్ సిద్దాంతం
జవాబు : B - బోధనా సిద్దాంతం.
15). పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాలలో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని రెండు ప్రయత్నంలలో తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన..?
A). 75%
B). 60%
C). 55%
D). 70%
జవాబు : A - 75%.
16). ఏపీ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాథన్యం ఇవ్వబడిన అంశం..?
A). ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు
B). పాఠశాలలకు టీఎల్ఎం సరఫరా
C). గణిత మరియు సైన్స్ కిట్ల సరఫరా
D). శిశు కేంద్రీకృత విద్య
జవాబు : D - శిశు కేంద్రీకృత విద్య.
17). ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని ఏ వికాసాన్ని సూచిస్తుంది..?
A). ఉద్వేగ వికాసం
B). సాంఘిక వికాసం
C). మానసిక వికాసం
D). శారీరక వికాసం
జవాబు : C - మానసిక వికాసం.
18). వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు..?
A). రెండు రకాలు
B). మూడు రకాలు
C).నాలుగు రకాలు
D). ఐదు రకాలు
జవాబు : A - రెండు రకాలు.
19). భిన్నమైనది గుర్తించండి..?
A). అభిరుచి
B).అవధానం
C). అతి అభ్యసనం
D). అవరోధం
జవాబు : D - అవరోధం.
20). రమణకు తన హోమ్ వర్క్ చేయాలనీ లేదు. అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడి సంఘర్షణ..?
A). ఉపగమ - పరిహార
B). ఉపగమ - ఉపగమ
C). పరిహార - పరిహార
D). ద్విఉపగమ పరిహార
జవాబు : C - పరిహార - పరిహార.
21). పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ..?
A). అనుగుణ్యం
B). సాంశీకరణం
C). వ్యవస్తీకరణం
D). పరిరక్షణం
జవాబు : A - అనుగుణ్యం.
22). అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన నియమం..?
A). పునర్బలన నియమం
B). సంసిద్ధాత నియమం
C). అబ్యాస నియమం
D). ఫలిత నియమం
జవాబు : B - సంసిద్దత నియమం.
23). కోల్ బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ..?
A). వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి
B). అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి
C). విధేయత, శిక్ష దశ
D). సహజ సంతోషఅనుసరణ, సాధనోపయోగ దశ
జవాబు : B - అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి.
24). మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది..?
A). తల్లీదండ్రుల వైఖరి
B). తల్లీ ఆహారపు అలవాట్లు
C). కుటుంబ పరిసరాలు
D). తల్లీ శారీరక ఆరోగ్యం
జవాబు : A - తల్లీ దండ్రుల వైఖరి.
25). ప్రక్షేపక పరీక్ష లక్షణం..?
A). సహజ ఉద్దిపన
B). అస్పష్టమైన ఉద్దిపన
C). అస్పష్టమైన ప్రతీస్పందన
D). సహజ ప్రతీస్పందన
జవాబు : B - అస్పష్టమైన ప్రతీ స్పందన.
26). క్రిందివానిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష..?
A). అంగుళి నైపుణ్య పరీక్ష
B). డిఫరేన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష
C). టీచింగ్ ఆప్టిట్యూడ్ పరీక్ష
D). మెయిర్ సీషోర్ ఆర్ట్ జడ్జి మెంట్ పరీక్ష
జవాబు : B - డిఫెరేన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష.
27). పీయాజే సిద్దాంతం యొక్క విద్యా అనుప్రయుక్తం..?
A). నిర్మాణత్మక వాదం
B). కార్యకారణ వాదం
C). నిర్మాణ వాదం
D). ప్రవర్తన వాదం
జవాబు : A - నిర్మణత్మక వాదం.
28). ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టర్ /రికార్డ్ ద్వారా తెలుసుకోవచ్చు..?
A). వస్తు ప్రవేశ రిజిస్టర్
B). ఆవర్జా పుస్తకం
C). లాగ్ బుక్
D). నగదు పుస్తకం
జవాబు : B&D.
29). ప్రధానోపాధ్యాయునిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనేది ఈ రక్షక తంత్రం..?
A). ఉపసంహారణ
B). ప్రేరక తారుమారు
C). ప్రక్షేపనము
D). విస్తాపనం
జవాబు : D - విస్తాపనం.
30). ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి, ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించు సంస్థ..?
A). CBSE
B). NCTE
C). CIET
D). CCRT
జవాబు : B - NCTE.
31). మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు బాల్యదశ కాలాన్ని ఈ క్రింది ఏ సంవత్సరం వరకూ అని గుర్తించారు..?
A). 14 సంవత్సరాలు
B). 14-15 సంవత్సరాలు
C). 15-18 సంవత్సరాలు
D). 18 సంవత్సరాలు
జవాబు : A - 14 సంవత్సరాలు.
32). పిల్లల పెంపక విధానాలు, తల్లీ తండ్రులు ప్రవర్తించే శైలులు పిల్లల మూర్తిమత్వంపై ప్రభావం చూపుతాయని మనోలైంగిక సిద్దాంతం ద్వారా తెలిపిన శాస్త్రవేత్త ఎవరు..?
A). సిగ్మాండ్ ఫ్రాయిడ్
B). కోహేలర్
C). ఎరిక్ సన్
D). టాగార్టేన్
జవాబు : A - సిగ్మాండ్ ఫ్రాయిడ్.
33). ముందుగా నిర్దారించిన ప్రశ్నల ఆధారంగా నిర్వహించే పరిపృచ్చ పద్దతిను ఏమని పిలుస్తారు..?
A). సంరచిత పరిపృచ్చ
B). అసంరచిత పరిపృచ్చ
C). A&B
D). పైవేవి కావు
జవాబు : A - సంరచిత పరిపృచ్చ.
34). ప్రయోగం చేసే సమయంలో ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరాన్ని ఏమని పిలుస్తారు..?
A). స్వతంత్ర చరం
B). పరతంత్ర చరం
C). జోక్య చరం
D). A&C
జవాబు : A - స్వతంత్ర చరం.
35). మానవ జీవితంలో 6 సంవత్సరాల నుండి 10-12 సంవత్సరాలు వరకూ వుండే దశను ఏమని పిలుస్తారు..?
A). పూర్వబాల్య దశ
B). ఉత్తర బాల్య దశ
C). పూర్వ కౌమర దశ
D). ఉత్తర కౌమర దశ
జవాబు : B - ఉత్తర బాల్య దశ.
36). మానవ మనుగడకు మూలము మన ఆలోచనలే అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరూ..?
A). డెకార్టే
B). గ్యారేట్
C). గేట్స్
D). అసుబెల్
జవాబు : A - డెకార్టే.
37). 90-110 ప్రజ్ఞా లబ్ది కలిగిన వారిని ఏమని పిలుస్తారు..?
A). సగటు ప్రజ్ఞా వంతులు
B). ఉన్నత ప్రజ్ఞా వంతులు
C). అత్యున్నత ప్రజ్ఞావంతులు
D). మేధావులు, ప్రతిభావంతులు
జవాబు : A - సగటు ప్రజ్ఞావంతులు.
38). ఆర్మీ జనరల్ క్లాసిఫీకేషన్ పరీక్ష ఈ క్రింది ఏ ప్రజ్ఞా పరీక్ష రకానికి చెందినవీ..?
A). శాబ్దిక పరీక్షలు
B). అశాబ్దిక పరీక్షలు
C). వైయుక్తిక పరీక్షలు
D). శక్తి - వేగ పరీక్షలు
జవాబు : A - శాబ్దిక పరీక్షలు.
39). ఏక కారక సిద్దాంతంను ప్రతీపాదించినవారు ఎవరు..?
A). బినే
B). స్టేర్న్
C). టెర్మన్
D). పైవారందరూ.
జవాబు : D - పై వారందరూ.
40). కారు నడపడంలో ఇచ్చిన శిక్షణ ట్రాక్టర్ నడపడంలో కూడా సహాయపడడం అనునది ఈ క్రింది ఏ బదాలాయింపునకు చెందినది..?
A). అనుకూల బదలాయింపు
B). వ్యతిరేక బదలాయింపు
C). శున్య బదలాయింపు
D). ద్విపార్స్య బదలాయింపు
జవాబు : A - అనుకూల బదలాయింపు.
0 Comments