CRPF నుండి ఒక మంచి జాబ్ నోటిఫేషన్ రావడం జరిగింది. సబ్ ఇన్‌స్పెక్టర్ (రేడియో ఆపరేటర్/క్రిప్టో/టెక్నికల్/సివిల్) మరియు ASI (టెక్నికల్/డ్రాఫ్ట్స్‌మ్యాన్)లో గ్రూప్ B మరియు C నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సింగల్ స్టాఫ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.
దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించవలెను. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఉంటాయి.
ఖాళీలు ఆల్ ఇండియా ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా CRPF వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ- 01/05/2023
ఆన్‌లైన్ దరఖాస్తులు & ఆన్‌లైన్ ఫీజు స్వీకరణకు చివరి తేదీ- 21/05/2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ విడుదల- 13/06/2023 నుండి
పరీక్ష తేదీ వరకు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్ (తాత్కాలిక)- 24/06/2023 To 25/06/2023
పోస్ట్ లు ఖాళీలు :
సబ్-ఇన్‌స్పెక్టర్ ( RO/Crypto/Technical/Civil (male) - 51
అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (టెక్నికల్)- 146
సబ్-ఇన్‌స్పెక్టర్ (డ్రాఫ్ట్స్‌మ్యాన్) - 15
అర్హతలు:
పొస్ట్‌ని బట్టి బ్యాచిలర్ డిగ్రీ, B.E./B.Tech ,సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా అర్హతలుగా ఇవ్వడం జరిగింది.
వయస్సు:
సబ్-ఇన్‌స్పెక్టర్ (రేడియో ఆపరేటర్/క్రిప్టో/టెక్నికల్): దరఖాస్తుల ముగింపు తేదీ 21/05/2023 నాటికి అభ్యర్థి వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థి 22/05/1993కి ముందు జన్మించి ఉండకూడదు.
సబ్-ఇన్‌స్పెక్టర్ (సివిల్): దరఖాస్తు ముగింపు తేదీ 21/05/2023 నాటికి అభ్యర్థి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి 22/05/1993కి ముందు లేదా 21/05/2002 తర్వాత జన్మించి ఉండకూడదు.
అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (టెక్నికల్/డ్రాఫ్ట్స్‌మ్యాన్): దరఖాస్తు చివరి తేదీ 21/05/2023 నాటికి అభ్యర్థి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి 22/05/1998కి ముందు లేదా 21/05/2005 తర్వాత జన్మించి ఉండకూడదు.
జీతం:
35400-112400 ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
ఎంపిక విధానం :
రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో వ్రాత పరీక్ష/PST/PET & DV మరియు వైద్య పరీక్ష ల ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
పూర్తి సమాచరం నోటిఫికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
0 Comments