ఆంధ్రప్రదేశ్ లో హైకోర్ట్ మరియు డిస్ట్రిక్ కోర్ట్ కి సంబందించి చాలా రోజుల క్రితం జాబ్ నోటిఫికేషన్ వచ్చిన విషయం మనకు తెలిసిందే అయితే వాటికి సంబందించి ఫలితాలు రావడం చాలా మంది జాబ్ లో చేరడం కూడ జరిగింది.
అయితే చాలా మంది అభ్యర్థులు 2nd లిస్ట్ గురించి అంటే మళ్ళీ ఫలితాల గురించి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఫలితాలు వచ్చే నెల మొదటి వారం వరకు టైమ్ పట్టవచ్చు అని మనకు సీనియర్స్ నుంచి సమాచరం తెలుస్తుంది. ఇటు వంటి తరుణలో హైకోర్ట్ కి సంబందించి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ పోస్ట్ లకు సంబందించి పూర్తి సమాచరం ఇప్పుడు మనం తెలుసుకుందా. అయితే నిన్న 27 వ తేదీన హైకోర్ట్ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలు లా క్లర్ ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చును. ఈ పొస్ట్ లను కాంట్రాక్ట్ పద్దతి లో భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:
22.07.2023 సాయంత్రం 5:00 గంటల వరకు
పోస్టుల సంఖ్య:
26 లా క్లర్క్‌లు
నియామకం ఆధారం:
కాంట్రాక్ట్ ఆధారంగా
ఉద్దేశ్యం:
గౌరవనీయులైన న్యాయమూర్తులకు సహాయం చేయడానికి
గౌరవ వేతనం:
నెలకు రూ.35,000/-
దరఖాస్తు సమర్పణ:
సక్రమంగా పూరించిన దరఖాస్తు ఫారమ్, అవసరమైన పత్రాల (వయస్సు రుజువు, విద్యార్హతలు) ధృవీకరించబడిన కాపీలతో పాటు అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, A.P., పిన్‌కోడ్‌లోని రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్), A.P. హైకోర్టుకు పంపాలి. - 522239.
సమర్పణ విధానం:
రసీదుతో రిజిస్టర్ చేయబడిన పోస్ట్.
దరఖాస్తు ఫారమ్ మరియు మార్గదర్శకాలు: సూచించిన దరఖాస్తు ఫారమ్ మరియు మార్గదర్శకాలను A.P. హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ aphc.com.in లో చూడవచ్చు.
వయస్సు:
అభ్యర్థులు దరఖాస్తుల సమర్పణకు నిర్ణయించిన చివరి తేదీ కంటే ముందు జనవరి 1 / జూలై 1 నాటికి 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి.
అర్హతలు : అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీని పొంది ఉండాలి. 10+2 సంవత్సరాల పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత లా డిగ్రీ చదివి ఉండాలి పూర్తి సమాచరం నోటిఫికేషన్ లో చూసుకోవచ్చును.
పూర్తి సమాచరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చెయ్యండి. Click Here
0 Comments