భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 2024 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులపై ప్రత్యేక దృష్టిను కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.
గడిచిన కొంత కాలం క్రింద మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి భారతీయ రైల్వే లో ఖాళీలు పై సమాచారం కావాలని ఆర్టీఐ ను కోరగా, అతను అడిగిన వివరాలపై భారతీయ కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చినది.
2023 జూన్ 1వ తేది నాటికి భారతీయ రైల్వే శాఖలో వివిధ కేటగిరీలలో( గ్రూఫ్-D,C,B,A) 2.74 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇందులో రైల్వే సేఫ్టీ ఉద్యోగాలకు సంబందించిన 1,77,924 ఖాళీలు ఉన్నాయని ఇండియన్ రైల్వేస్ తెలిపింది.
ఖాళీగా ఉన్న పోస్ట్ లను వెంటనే భర్తీ చెయ్యాలి అని రాజ్యసభ్హ సభ్యుడు ఆర్.కృష్ణయ్య గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం కూడా జరిగింది.
అయితే ప్రస్తుతం పార్లమెంట్ సమవేశలలో కూడా ఈ ఖాళీల మీద చర్చ జరగడం గమనించదగినిన విషయం గా మనం చెప్పుకోవచ్చును. ఇప్పుడు చాలా పోస్ట్ లు భర్తీ ప్రక్రియలో ఉన్నాయి కావున కొన్ని నెలలు గడిచిన తరువాత కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశలు ఉన్నాయి.
రైల్వే ఖాళీల భర్తీపై భారతీయ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు.. ఎలాంటి..నిర్ణయం ప్రకటస్తుందో మనకు తెలియాలంటే మరికొంత కాలం నిరీక్షణ చేయడం తప్పనిసరి అని మనం చెప్పుకోవచ్చు.
0 Comments