Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APPSC గ్రూఫ్ 1,2 బ్రేకింగ్ న్యూస్ వయోపరిమితి కూడ పెంపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 1000 కు పైగా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీనకు వెలువడనున్న నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకి ఒక ముఖ్యమైన వార్త.

appsc Group 1 and 2 update

త్వరలో భర్తీ చేయనున్న ఏపీపీఎస్సీ గ్రూప్స్ పోస్టుల భర్తీలో అభ్యర్థుల వయస్సు పరిమితిను 42 సంవత్సరాలు నుండి 44 సంవత్సరాలు కు పెంచాలని తాజాగా ఏపీపీఎస్సీ సభ్యులు ఒకరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారుకు ఒక లేఖ ద్వారా నిరుద్యోగ అభ్యర్థుల తరపున విన్నవించడం జరిగింది.

ఏపీపీఎస్సీ చైర్మన్ కు సభ్యుడు వ్రాసిన ఈ లేఖలో అభ్యర్థుల వయస్సు పరిమితిను పెంచవలసిన అవసరం ఏమిటో వివరించడం జరిగింది.

లేఖలో చైర్మన్ దృష్టికు  తెలిపిన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.

ఏపీ లో 2011,2016,2018 మరియు 2022 సంవత్సరాలలో 651 గ్రూప్ 1 పోస్టుల భర్తీ జరిగినది.

2011,2016,2018 ఏడాదిలలో 2145 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ జరిగింది.

2013,2016,2018 ఇయర్స్ లో  4783 గ్రూప్ 3 పోస్టుల భర్తీనకు నోటిఫికేషన్ వెలువడినది.

2011,2016,2021 లో 3006 గ్రూప్ 4 పోస్టుల భర్తీ జరిగింది.

2011,2016,2018 ఏడాదిలలో 1468 డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీ జరిగింది.

2018 వ సంవత్సరంలో 237 జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీ జరిగింది.

దాదాపుగా ఏపీలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 తదితర నోటిఫికెషన్స్ వచ్చి సుమారుగా 4 సంవత్సరాలు పూర్తి కావచ్చాయి. ఈ నేపథ్యంలోనే గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ మరియు జూనియర్, డిగ్రీ కాలేజ్ పోస్టుల భర్తీ కు వచ్చే నోటిఫికెషన్స్ కోసం లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని,

ఈ తరుణంలోనే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు ను 42 నుండి 44 సంవత్సరాలకు పెంచితే, నిరుద్యోగ అభ్యర్థులకి ఎంతో లబ్ది చేకూరుతుంది అని ఏపీపీఎస్సీ కమిషన్ సభ్యుడు గౌరవ చైర్మన్ గారుకు ఈ లేఖలో నిరుద్యోగ అభ్యర్థుల తరపున తెలియజేశారు.

 ఏపీ లో త్వరలో చేపట్టబోయే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీనకు సంబందించిన, అతి కీలకమైన ఈ వయస్సు పరిమితి పెంపు గురించి  వచ్చే 10 రోజులలోపు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రివర్యులు దృష్టికి ఏపీపీఎస్సీ చైర్మన్ తీసుకుని వెళ్తారని , ఈ ప్రతీపాదనకు ఏపీ సీఎం గారు అభ్యర్థులకు అనుకూలంగానే తమ నిర్ణయం ప్రకటించనున్నారని నిరుద్యోగులు తమ తమ  ఆశాభవంను వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 

Post a Comment

0 Comments