Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Mega DSC లో కదలిక 15000 పోస్ట్ లకు నోటిఫికేషన్ ఎప్పుడో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ Mega DSC దీని పై ఈ రోజు ఒక క్లారిటీ రావడం జరిగింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు భారీ ఊరట ను కల్పించే వార్తలు ప్రస్తుతం ఒక్కొక్కటిగా సందడి చేస్తున్నాయి. 

అయితే ఈ రోజు మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆగస్ట్ లో DSC నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. దీని మీద ప్రభుత్వ కసరత్తు చేస్తుంది అని వివరించడం జరిగింది. 

AP Mega DSC update 2023


గడిచిన రోజున ఏపీ లో డీవైఈఓ పోస్టుల భర్తీకోసం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లుగా ఒక అధికారిక ప్రకటన వెలువడినది. అతి త్వరలో ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలనీ ఏపీపీఎస్సీ కు ఏపీ ఆర్థిక శాఖ తెలిపినట్లుగా ఒక జిఓ జారీ అయినది.

ఈ వరుసలోనే ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రాబోయే సుమారుగా 1000 గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్టుల భర్తీనకు ఆర్థిక శాఖ తమ ఆమోదమును తెలుపనున్నట్లుగా, అన్ని అనుకున్నట్లుగా సవ్యంగా జరిగితే ఆగష్టు నెలాఖరు నాటికి ఏపీ లో భారీ సంఖ్యలో గ్రూప్ 2 పోస్టుల భర్తీనకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు వెను వెంటనే గ్రూప్ 1 & 2 ఉద్యోగాలకు ప్రిపరేషన్ కావడం మంచి విషయంగా చెప్పుకోవచ్చు.

ఈ విషయం ఇలా ఉంటే, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో గత నాలుగేళ్ళగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ఏపీ మెగా డీఎస్సీ పై ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు ప్రకటన చేశారు.

AP రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు మెగా డీఎస్సీ ప్రకటన విడుదల కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, అందుకు తగిన సన్నద్దాలను రాష్ట్ర విద్యా శాఖ అధికారులు చేస్తున్నారని, రాబోయే నెల అనగా ఆగష్టు లో మెగా డీఎస్సీ పై ఒక ప్రకటన విడుదలకు అవకాశాలు ఉన్నాయని, విలేఖర్ల సమావేశంలో విద్యా శాఖ మంత్రివర్యులు ప్రకటన చేసినట్లుగా వార్త వచ్చింది.

ఈ పరిస్థితులను అన్నిటిని చూస్తుంటే రాబోయే ఎన్నికల నామ సంవత్సరం 2024 ను  దృష్టిలో పెట్టుకుని లక్షలాది మంది నిరుద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి గానూ  ఏపీలో ప్రభుత్వ ఉద్యోగ నియామక నోటిఫికేషన్స్ విడుదల అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. 

Post a Comment

0 Comments