ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ నగరమైన విశాఖపట్నం గ్రంధాలయ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నట్లుగా, వీటికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ జిల్లా గ్రందాలయ సంస్థ, వైజాగ్ నుండి ఒక ప్రకటన తాజాగా వచ్చింది. ఈ పోస్టులకు అర్హులైన స్థానికత కలిగిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ ధరఖాస్తులకు చివరి తేది : జూలై 15,2023.
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రేడ్ - 3 లైబ్రెరీయన్స్ - 7
రికార్డు అసిస్టెంట్ - 1
లైబ్రరీ హెల్పర్స్ - 4
మొత్తం పోస్టులు :
12 పోస్టులను తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా సమాన విద్యార్హతలను పూర్తి చేసి, గుర్తింపు పొందిన సంస్థ నుండి CLiSc కోర్సులో ఉత్తీర్ణత పొంది, కంప్యూటర్ నాలెడ్జ్ ను కలిగి ఉన్న అభ్యర్థులు గ్రేడ్ 3 లైబ్రరీయన్స్ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు.
10వ తరగతి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు రికార్డు అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
8వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు లైబ్రరీ హెల్పర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18-42 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.
ఎస్సీ /ఎస్టీ /బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, విభిన్న ప్రతిభావంతులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి?
ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తులను నిర్ణిత గడువు చివరి తేదీలోగా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపవలెను. లేదా స్వయంగా అందించవచ్చును.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎంపిక విధానం :
విద్యా అర్హతల మార్కులు / మెరిట్ / ఇంటర్వ్యూల విధానంలో ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
అవుట్ సోర్సింగ్ నియమ నిబంధనలను అనుసరించి ఈ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు జీతభత్యాలు లభించనున్నాయి.
దరఖాస్తులను పంపవలసిన చిరునామా :
కార్యదర్శి,
జిల్లా గ్రంధాలయ సంస్థ,
లక్ష్మి గాయత్రీ అపార్ట్మెంట్,
డోర్ నెంబర్ : 48-7-49, ప్లాట్ నెంబర్ : 11,
3వ అంతస్తు, రామా టాకీస్, వెజ్ మార్కెట్ లైన్,
విశాఖపట్నం - 530016.
Notification Link Click Here
0 Comments