Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP RSK లో TA ల నియామకం జరుగుతుందా ? మనోహర్ గారు మేలు చేస్తారా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయిది దీనిని ప్రభుత్వం చాల ప్రతిష్టత్మకంగా తిసుకొన్న విషయం మనకి తెలిసింది. 

గతంలో రాష్ట్ర ప్రభుత్వం RSK లో సిబ్బందిని నియమించిన విషయం తెలిసిందే అయితే ఆ యొక్క గైడ్‌లైన్స్ లో 11 నెలలు కాంట్రాక్ట్ పిరియడ్ ఉన్నప్పటికి దానిని గత ప్రభుత్వం 2 నెలలకు మార్చి నోటిఫికేషన్ విడుదల చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఆడుకున్న విషయం అందరికి తెలిసింది. 


అప్పటిలో ప్రభుత్వం జీతలు కూడ సొసైటి ద్వారా చెల్లించి తీవ్రమైన ఇబ్బందులు పెట్టడం జరిగింది. సొసైటి లు జీతం చెల్లించడంలో సగం జీతం ఇవ్వడం మరియు ఆలస్యంగా జీతలు చెల్లించడం చేసాయి. అయినప్పటికి కాంట్రాక్ట్ ఉద్యోగులు మానకుండా వాళ్ళకు డ్యూటి దూర ప్రాంతంలో వేసిన సరే వెళ్ళి రైతులకు సేవ చేయ్యండం జరిగింది. 

కాని రైతులకు సేవ చేసే RSK సిబ్బందిని ఇంతగా ఇబ్బంది పెట్టడం సరి అయిన పద్దతి కాదు. 

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇతర బయట వ్యక్తులను నియమించడం ద్వారా కరప్షన్ జరుగుతుంది. మరియు సిబ్బంది అందుబాటులో లేక పోవడం వంటివి జరుగుతున్నాయి కావున ప్రభుత్వం గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించి పనిచేపించడం జరిగింది. 

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ కాంట్రాక్ట్ సిబ్బందిని ఆటోరెన్యువల్ చెయ్యవలసి ఉంది కాని దానిని ఇంకా చెయ్యలేదు.

బయట వ్యక్తులను నియమిండం ద్వారా రైతులు ఇబ్బంది పడతారు మరియు కరప్షన్ కూడ ఎక్కువగా జరిగే అవకాశలు కనిపిస్తున్నాయి. 

అయితే రైతు సేవా కేంద్రం సిబ్బంది( TA, Deo, Helpers ) రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి అయిన మనోహర్ సార్ ని కలవడం జరిగింది. మరియు వినతి పత్రలు ఇవ్వడం కూడ జరిగింది. దీనికి ఆయన స్పదిస్తు ప్రతి RSK లో సివిల్ సప్లై ద్వారా టెక్నికల్ అసిస్టెంట్లను నియమిస్తాం అని చెప్పడం జరిగింది. దీనితో కాంట్రాక్ట్ ఉద్యోగులలో ఆనందం నెలకొంది. అయితే కాకినాడ పోర్ట్ లో 18 మంది వరకు టెక్నికల్ అసిస్టెంట్ లను నియమించడం జరిగింది. దీనికి అభ్యర్థులు చాలా ఆనందం వ్యక్తం చేసారు


అయితే ఇప్పుడు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాని సివిల్ సప్లై ద్వారా RSK లో టెక్నికల్ అసిస్టెంట్ లను నియమిస్తు ఆర్డర్స్ విడుదల కాలేదు. దీనితో అభ్యర్థులలో భయం, ఆదోళన నెలకొంది. 

సివిల్ సప్లై ద్వారా RSK లో TA లను నియమించడం ద్వారా రైతులకు మరియు సిబ్బందికి మేలు చేసిన వారు అవుతారు. త్వరగా TA లను మరియు ఇతర సిబ్బందిని రెన్యూవల్ చెయ్యవలసినదిగా అభ్యర్థులు కోరుకుంటున్నారు. 

నాణ్యత ప్రమాణలు చూసే టెక్నికల్ అసిస్టెంట్ లు లేక పోతే ధాన్యం కొనుగోలు ప్రక్రియ పక్కదారి పట్టే అవకాశలు కనిపిస్తున్నాయి. 

ఈ సారి 48 గంటలలో రైతుకి డబ్బులు పడతాయి కాబట్టి RSK కి ధాన్యం అమ్మే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిబ్బందిని త్వరగా సివిల్ సప్లై ద్వారా కాంట్రాక్ట్ పద్దతిలో ఉన్న వారిని ఆటోరెన్యూవల్ చెయ్యవలసిన అవసరం ఉంది. 

Post a Comment

0 Comments