Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP ప్రభుత్వలో ఇదెక్కడి ధాన్య సేకరణ, ప్రభుత్వనికి చెడ్డపేరు తప్పదా ?

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ధాన్య సేకరణ జరగనుంది. ఈ ప్రక్రియలో పని చేసే సిబ్బంది ని ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. సహకార సంస్థలకు ఇచ్చేసం కదా! అనే భ్రమలో బతుకుతుంది.  ప్రభుత్వం తరపునుంచి RSK లలో సిబ్బందిని నియమించలేదు.


గత ప్రభుత్వంలో కూడ బయటవ్యక్తులు పెట్టడం గొడవలు కావడం ఇలా చాలా ఇబ్బందులు ఎదురైనవి మరియు కరప్షన్ కూడ ఎక్కువగా జరిగింది.  మరియు మిల్స్ దగ్గరకూడ అనేక ఇబ్బందులు ఎదురైనవి చివరికి ప్రభుత్వ లో ఉన్న ఉన్నతమైన అధికారులు కూడ మిల్స్ దగ్గరకు రావలసిన పరిస్థితులు ఎర్పడినవి.  ఇవి అన్ని చూసిన ప్రభుత్వం తప్పని పరిస్థితులలో కాంట్రాక్ట్ ఉద్యోగులను DSC ద్వారా సివిల్ సప్లై తరుపునుంచి నియమించింది. ఇలా చేసిన తరువాత ధాన్య సేకరణ మొత్తం ప్రశాంతంగా పూర్తి కావడం జరిగింది. 

అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను కనీసం పట్టించుకోవడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల కాల పరిమితి గత సీజన్ కి ముగిసినది. దానిని ఈ ప్రభుత్వం కనీసం రెన్యువల్ చెయ్యలేదు. నిజానికి వాళ్లను మొదటిలో 11 నెలలకు తీసుకుంటాం అని చెప్పిన గత ప్రభుత్వం 2 లేదా 3 నెలలకు పరిమితం చేసి వాళ్ళను చాలా ఇబ్బందులు పెట్టింది. ఈ కొత్త ప్రభుత్వం వస్తే మా బతుకులు మారతాయి అని భావించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ రోజు నిరాశ మిగిలింది. 

రైతులకు సేవ చేసే సిబ్బందిని ఇంతలా ఇబ్బంది పెట్టడం సరి కాదు. రేపు అన్నరోజు రైతు ధాన్యం అమ్మడానికి RSK కి వస్తే అక్కడ సిబ్బంది లేని పరిస్థితి ఏర్పడుతుంది. బయట వ్యక్తులను నియమించినప్పుడు వాళ్ళు ప్రతి రోజు వస్తారు అనే రూల్ లేదు. వాళ్ళు ఒక వేళ సెలవు పెట్టిన ఎవరికి చెప్పవలసిన అవసరం కూడ అంతగా లేదు. 

కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు. నిరుద్యోగ బృతి అని చెప్పింది. వాటిని కూడ మేము అడగడం లేదు. మా యొక్క కాంట్రాక్ట్ పిరియడ్ ని రెన్యువల్ చెయ్యడి చాలు అని RSK లో పని చేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ (TA) లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు  ( DEO) , హెల్పర్ లు ప్రభుత్వన్ని కోరుకుంటున్నారు. 

అయితే వీరు ప్రభుత్వనికి వీరి యొక్క సమస్యను తెలియజేస్తు లెటర్ కూడ మంగళగిరి లో ఇవ్వడం జరిగింది. వీరి యొక్క సమస్యను KNSM20240814442 నెంబర్ తో మీకోసం వెబ్‌సైట్ లో పెట్టడం కూడ జరిగింది. కాని ఇప్పటి వరకు వచ్చి సమస్య పరిష్కరించలేదు. దీనితో కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలా ఆదోళచెందుతున్నారు. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడ అని వాపుతున్నారు. 

ఇప్పటికైన ప్రభుత్వం మేలుకొని కాంట్రాక్ట్ ఉద్యోగులను RSK లో నియమిస్తే చాలా వరకు బాగుంటుంది. అతే తప్ప సహకార సంస్థలకు అప్పచెప్పేసం వాళ్ళు సిబ్బందిని పెట్టుకుంటారు అని ప్రభుత్వం భావిస్తే, వాళ్ళు సిబ్బందిని పెడతారో, లేదో ,పెడితే ఎన్ని నెలలకు పెడతారో అంత ఆ "పెద్ద తిరుపతి వెంకన్న బాబుకే" తెలియాలి.

Post a Comment

0 Comments